Advertisement
Advertisement
Abn logo
Advertisement

Texasలో హాట్ టాపిక్.. ఈ రెస్టారెంట్ Wifi పాస్‌వర్డ్ ఏంటో మీరు చెప్పగలరా..?

అదో రెస్టారెంట్. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ అక్కడ కూర్చున్న వారిలో చాలా మంది ఏదో భారీ టెన్షన్‌లో ఉన్నారు. పెన్ పేపర్లతో ఏదో రాస్తూ, కొట్టేస్తూ తెగ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి పెద్దగా అరిచాడు. ‘ఎస్ నేను సాధించాను’ అంటూ అరిచాడు. ఇది చూసిన వారంతా అతడిని ప్రశంసిస్తూ తెగ పొగిడేశారు. ఇంతకీ అతడేం సాధించారో తెలుసా..? ఆ రెస్టారెంట్ వైఫై పాస్‌వర్డ్. అయితే అదేమీ హ్యాక్ చేసి సాధించలేదు కానీ.. చాలా కష్టపడి ఓ క్లిష్టమైన గణిత సమస్యను పరిష్కరించి మరీ సాధించాడు. 

ఇంతలో మరో వ్యక్తి తనకు సాధ్యం కాకపోవడంతో అప్పటివరకు తనకు వచ్చిన ఫార్ములాను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తనకు సాయం చేయాలని నెటిజన్లను కోరాడు. దీంతో ఇప్పుడా రెస్టారెంట్ పేరు టెక్సాస్ మొత్తం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కస్టమర్ షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ రెస్టారెంట్ ఉంది. శాన్ ఆంటోనియో నగరంలో ప్రముఖంగా ఉన్న ఓ థాయ్‌ రెస్టారెంట్‌ స్థానికంగా చాలా పాపులర్. ఇక్కడ మెనూ కంటే వైఫై పాస్‌వర్డ్ చాలా స్పెషల్. మెనూలో ఏం ఉందని కస్టమర్లు చూడరు. ఇవాళ వైఫై పాస్‌వర్డ్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన లెక్కను పరిష్కరించేందుకు నానా తాంటాలు పడిన జాషువా గ్లాక్ అనే కస్టమర్‌.. తన వల్ల కాక దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరైనా లెక్కల  మాస్టార్లు తనకు సాయం చేయాలని ఆ పోస్ట్‌లో సదరు కస్టమర్ కోరాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

‘ఇక్కడి థాయ్ రెస్టారెంట్లో ఇది వైఫై పాస్‌వర్డ్. దీనిని పరిష్కరిస్తేనే నాకు వైఫై పాస్‌వర్డ్ లభిస్తుంది. ఎవరైనా గణితవేత్తలు ఉంటే నాకు సాయం చేయండి’ అని జాషువా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇక జాషువా షేర్ చేసిన లెక్కలో సమ్మగేషన్ సిగ్మా, ఎక్స్‌పోనెంట్స్, వేరియబుల్స్‌తో కూడిన ఓ లెక్క ఉంది. మరి దీనిని పరిష్కరించాలంటే నిజంగానే లెక్కల మాంత్రికులు కావాలేమో అనిపించేలా ఉంది.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement