ఆంక్షలు కఠినతరం

ABN , First Publish Date - 2021-05-06T06:11:59+05:30 IST

రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ తెలిపారు. బుధవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర దుకాణాలు తెరవాలన్నారు. అయితే ఐదుగురు కన్నా ఎక్కువమంది ఉండటానికి వీల్లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పనులు, వైద్యసేవల కోసం వెళ్లేవారికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

ఆంక్షలు కఠినతరం
ఎస్పీ సిద్ధార్థకౌశల్‌

ప్రజలతో పోలీసులు స్నేహభావంగా మెలగాలి

ఎమర్జెన్సీ సర్వీసులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు

144 సెక్షన్‌ అమలు: ఎస్పీ సిద్ధార్థకౌశల్‌

ఒంగోలు(క్రైం), మే 5 : రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ తెలిపారు. బుధవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర దుకాణాలు తెరవాలన్నారు. అయితే ఐదుగురు కన్నా ఎక్కువమంది ఉండటానికి వీల్లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ పనులు, వైద్యసేవల కోసం వెళ్లేవారికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజల పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించవద్దని ఆదేశించారు. వైద్యసిబ్బంది, మెడికల్స్‌, మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవని వివరించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత అత్యవసర సేవలు, వైద్యపరమైన అవసరాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతి ఉందని తెలిపారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఉదయం దుకాణాలు తెరిచిన సమయంలో గుంపులుగుంపులుగా చేరకూడదన్నారు. కర్ఫ్యూకు సంబంధించి జిల్లాస్థాయిలో అన్నిశాఖల అధికారులతో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు వివరించారు. తద్వారా ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా సత్వరమే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


 మోటర్‌సైకిల్‌ పై ఎస్పీ పర్యటన

బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు నేపథ్యంలో నగరంలో ఎస్పీ బుల్లెట్‌పై తిరుగుతూ పర్యవేక్షించారు. ఎస్పీ కార్యాలయం నుంచి బయలుదేరి బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, చర్చి సెంటర్‌, వీఐపీ రోడ్డ్‌, మంగమూరు జంక్షన్‌ ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆంక్షల అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసాద్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ యన్‌.సురేంద్ర, ఎస్బీ సీఐ సూర్యనారాయణ, కమాండ్‌ కంట్రోల్‌ సీఐ రాంబాబు, నగర సీఐలు శివరామకృష్ణరెడ్డి, రాజేష్‌, సీతారామయ్య తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-05-06T06:11:59+05:30 IST