పునరుద్ధరణ సాధ్యమేనా!

ABN , First Publish Date - 2022-01-21T05:04:23+05:30 IST

జిల్లా కేం ద్రంలోని సీసీఐ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పరిశ్రమ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యే పనేకాద న్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

పునరుద్ధరణ సాధ్యమేనా!
జిల్లా కేంద్రంలోని సీసీఐ పరిశ్రమ

సీసీఐ పరిశ్రమపై మళ్లీ రాజకీయ పార్టీల ఫైట్‌
పూర్తిగా శిథిలమై తుప్పుపట్టిన భారీ యంత్రాలు, వాహనాలు
ప్రభుత్వాల నాన్చుడు ధోరణిపై విసుగెత్తి పోయిన జిల్లా వాసులు
కార్మిక కుటుంబాల ఉపాధిపై సన్నగిల్లుతున్న ఆశలు

ఆదిలాబాద్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని సీసీఐ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పరిశ్రమ పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యే పనేకాద న్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయినా పరి శ్రమ ప్రారంభంపై రాజకీయ పార్టీలు ఆందోళనలు, విమర్శలు తీవ్ర దుమా రాన్నే రేపుతున్నాయి. ఇన్నాళ్లు పరిశ్రమను పునరుద్ధరించేందుకు చేసిన అన్ని రకాల ప్ర యత్నాలు విఫలం కావడంతో పోరుబాటకు సి ద్ధ్దమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. పరిశ్రమ నష్టా ల్లో కూరుకుపోవడంతోపాటు పెద్ద ఎత్తున వివిధ రకా ల అప్పుల భారం పెరిగిపోవడంతో తిరిగి పరిశ్రమను పునరుద్ధరణ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కేంద్ర ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలుస్తోం ది. ఇప్పటికే సీసీఐ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేక నివేదికలు అందిం చడంతో కేంద్రం సై తం ఈ దిశగా ఆలో చిస్తున్నట్లు  ప్రచా రం సాగుతోంది. అ యితే రాష్ట్ర ప్రభు త్వం మాత్రం పరి శ్రమ పునరుద్ధరణకు అన్ని రకాల ప్రయ త్నాలు చేస్తున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ కేం ద్ర మంత్రులకు పరిశ్రమను పునరుద్ధరించాలంటూ లేఖ రాయడంతో మళ్లీ ఈ అం శం తెరపైకి వచ్చింది. దీంతో జి ల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఓ అడుగు ముందుకేసి సీసీఐ సాధనకమిటీ ఆధ్వర్యంలో పరిశ్రమను పునరుద్ధరించాలంటూ గురువారం జి ల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో 772 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న సీసీఐ పరిశ్రమ 170 ఎకరాల టౌన్‌షిప్‌, 1500ల ఎకరాలలో సుమారు 48 మిలియన్‌ టన్నుల లైన్‌స్టోన్‌ నిల్వలను కలిగి ఉంది. పరిశ్రమను పునరుద్ధరించేందు కు అన్ని రకాల అవకాశాలు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపు ధోరణి కారణంగానే పరిశ్రమ ప్రారంభానికి నోచుకోవడం లేదంటూ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఇప్పట్లో కష్టసాధ్యమే..
ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి పరిశ్రమను పునరుద్ధరించాలంటూ పలుమార్లు ప్రయత్నాలు చేసినా ఎలాంటి స్పందన కనిపించడం లేదు. పరిశ్రమలోని భారీ యంత్రాలు, భవనాలు, ఇతర సామగ్రి పూర్తిగా శిథిలమై, తుప్పుపట్టడంతో పునరుద్ధరించడం భారీ వ్యయంతో కూడుకున్న పని. దీంతో కేంద్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో మొత్తం 11 సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుతం పని చేస్తున్నవి అస్సాం రాష్ట్రంలో బొకాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్‌బంద్‌, తెలంగాణలో తాండూర్‌ పరిశ్రమలు మాత్రమే. జిల్లాలో ఉన్న సిమెంట్‌ పరిశ్రమ 23 ఏళ్ల క్రితమే మూతపడిపోయింది. దీంతో ఏళ్ల తరబడి పరిశ్రమ నిర్వహణ లేకపోవడంతో ఆవరణ చిట్టడవిని తలపిస్తోంది. ఇప్పటికే కొన్ని యంత్రాలు చోరీకి గురయ్యాయి. అప్పట్లో పరిశ్రమ ఆస్తుల విలువ దాదాపుగా రూ.900 కోట్ల వరకు ఉంటుందని సీసీఐ అధికారులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల్లోని మరికొన్ని సిమెంట్‌ పరిశ్రమలతోపాటు జిల్లాలోని పరిశ్రమ ఆస్తులను కూడా వేలం వేసేందుకు సీసీఐ రంగం సిద్ధం చేసింది. అయితే కొందరు కార్మిక సంఘాల నేతలు కోర్టును ఆశ్రయించడంతో ఆస్తుల వేలం ప్రక్రియ వాయిదా పడినట్లు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
స్పష్టత ఇవ్వని కేంద్రం..
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను పునరుద్ధరించాలని ప లుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన కనిపించడం లేదు. స్పష్టతను కూడా ఇవ్వక పోవడంతో కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరిస్తే 3500 కుటుంబాలకు ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని, అలాగే రాష్ట్ర అవసరాలతో పా టు, పొరుగు రాష్ర్టాలకు సిమెంట్‌ను ఎగుమతి చేసే అ వకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గతంలోనే కేం ద్ర మంత్రులు సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటనలు చేసిన ఈది ఆచరణలో సాధ్యం కావ డం లేదు. మూతబడిన పరిశ్రమను పునరుద్ధరిస్తారా లేక పూర్తిగా ఎత్తి వేస్తారా అనే దానిపై కేంద్ర ప్రభు త్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రంలో అధి కారం చేపట్టిన పార్టీ సభ్యున్నే జిల్లా పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిపిస్తే తమ కల సాకారమవుతుందని అందరూ భావించిన కేంద్ర ప్రభుత్వం సీసీఐని పునరుద్ధరణపై దృష్టిని సారించినట్లు కనిపించడం లేదు. గతంలో ఒకటి రెండు సార్లు పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ సోయంబాపురావు పరిశ్రమ పునరుద్ధరణ అంశాన్ని లె వనెత్తినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ కాలం గడుపడంతో విసుగెత్తి పోతున్నా రు. కేవలం ఎన్నికల సమయంలోనే సీసీఐ పరిశ్రమను ప్రచారాస్త్రంగా వాడుకుంటూ ఆ తర్వాత నాన్చుడు ధోరణిని అవలంబిస్తూ అసలు విషయాన్నే మరిచి పోతున్నారంటూ జిల్లా వాసులు మండిపడుతున్నారు.

Updated Date - 2022-01-21T05:04:23+05:30 IST