జోరుగా శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణ పనులు

ABN , First Publish Date - 2022-01-24T06:10:58+05:30 IST

గత ఏడాది నవంబరు 17,18వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే

జోరుగా శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరణ పనులు

తిరుమల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది నవంబరు 17,18వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బంది లేకుండా రూ.1.30 కోట్ల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి వైకుంఠ ఏకాదశి నాటికి భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రూ.3.60 కోట్లతో వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గం పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వెంటనే స్పందించి భారీ నష్ణం జరగకుండా తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా విపత్తుల నిర్వహణ కరదీపిక (మాన్యువల్‌) రూపొందిస్తున్నారు. దీనికోసం కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించి, ముందస్తు హెచ్చరికలు చేసేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.  శ్యామ్‌(విజయనగరం), కార్యదర్శులుగా ఉమామహేశ్వరరావు(విజయనగరం), చందు నాయక్‌(కర్నూలు), ప్రభుదాస్‌(ప్రకాశం), రామాంజనేయులు(విశాఖపట్నం), పురుషోత్తం(చిత్తూరు), సురేష్‌ (కడప), శ్రీకాంత్‌(గుంటూరు) ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రవికుమార్‌, లక్ష్మీనారాయణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:10:58+05:30 IST