Abn logo
Mar 27 2020 @ 07:17AM

సరకు రవాణ విమానాలు తిరగొచ్చు...డీజీసీఏ ఉత్తర్వులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్(డీజీసీఏ) తీసుకున్న నిషేధ ఉత్తర్వుల నుంచి సరకు రవాణ ఉన్న విమానాలను మినహాయించారు. విదేశాల నుంచి పలు సరకులు మనదేశంలోకి దిగుమతి అవుతున్న నేపథ్యంలో సరకు రవాణ విమానాలను నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో పాటు విదేశాల్లో ఉన్న మన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక వాయుసేన విమానాలకు మాత్రం డీజీసీఏ ప్రత్యేక అనుమతి జారీ చేయవచ్చు. కరోనా వైరస్ కట్టడికి 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఏప్రిల్ 14వరకు రద్దును పొడిగిస్తూ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement