Advertisement
Advertisement
Abn logo
Advertisement

షర్మిల సంకల్ప సభకు ఆంక్షలు

ఖమ్మం: ఖమ్మంలో నిర్వహిస్తున్న వైఎస్ షర్మిల సంకల్ప సభకు ఆంక్షలు విధించారు. షర్మిలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తీరుపై షర్మిల అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో వారం క్రితం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీ హోర్డింగుల ఏర్పాటు చేశారని,  ఆయన టూర్‌లో లేని నిబంధనలు ఇపుడు ఎలా? అంటూ షర్మిల పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు తాను సంకల్పం ఎందుకు తీసుకున్నారో ప్రజలకు ఈ సభ ద్వారా ఆమె వివరించనున్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి సభలో పాల్గొంటున్నారు.


వాస్తవానికి లక్షన్నర మందితో సభను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు రావాలని షర్మిల భావించారు. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేవలం ఆరు వేల మందితో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహణకు ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. వలంటీర్లను పెట్టుకుని జనాన్ని నియంత్రిస్తూ కొవిడ్‌ నిబంధనల మేరకు సభను నిర్వహించుకోవాలని సూచి స్తూ పోలీసులు అనుమతి ఇచ్చారని షర్మిల పార్టీ వర్గాలు తెలిపాయి.  


Advertisement
Advertisement