రేసుగుర్రాలు

ABN , First Publish Date - 2020-08-05T06:41:26+05:30 IST

భారత్‌లో బిలియన్‌ డాలర్ల (రూ.7,500 కోట్లు)కు పైగా విలువైన స్టార్ట్‌పలు 21 ఉన్నాయి. స్టార్టప్‌ రంగంలో బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీని యునికార్న్‌గా

రేసుగుర్రాలు

  • దేశంలో 21 స్టార్ట్‌పల విలువ 
  • రూ.7,500 కోట్ల పైమాటే.. 
  • అత్యధిక యునికార్న్‌లున్న దేశాల్లో 
  • భారత్‌కు 4వ స్థానం 


ముంబై: భారత్‌లో బిలియన్‌ డాలర్ల (రూ.7,500 కోట్లు)కు పైగా విలువైన స్టార్ట్‌పలు 21 ఉన్నాయి. స్టార్టప్‌ రంగంలో బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీని యునికార్న్‌గా పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక యునికార్న్‌లున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ‘హురున్‌ గ్లోబల్‌ యునికార్న్‌ ఇండెక్స్‌ 2020’ ఈ విషయా న్ని వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా చైనా, బ్రిటన్‌ వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని వివరాలు.. 


  1. భారత్‌లోని 21 యునికార్న్‌ల మొత్తం విలువ 7,320 కోట్ల డాలర్లు
  2. దేశంలోని 11 యునికార్న్‌లలో మూడు చైనా కంపెనీలు (అలీబాబా, టెన్సెంట్‌, డీఎ్‌సటీ గ్లోబల్‌) పెట్టుబడులున్నాయి. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ అత్యధికంగా తొమ్మిందిటిలో పెట్టుబడులు కలిగి ఉంది. అమెరికాకు చెందిన టైగర్‌ గ్లోబల్‌ ఐదింటిలో పెట్టుబడులు  పెట్టింది 
  3. చైనాలో 227 యునికార్న్‌లున్నాయి. చైనాతో పోలిస్తే భారత్‌లోని వీటి సంఖ్య పదో వంతు కంటే తక్కువే 
  4. భారతీయ సంతతి వ్యక్తులు విదేశాల్లో స్థాపించిన స్టార్ట్‌పల్లో 40కి పైగా యునికార్న్‌లుగా ఎదిగాయి  
  5. చైనా సంతతి వ్యక్తులు విదేశాల్లో స్థాపించిన స్టార్ట్‌పలలో కేవలం 16 మాత్రమే యునికార్న్‌లుగా అవతరించాయి 
  6. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థాపించిన 61 యునికార్న్‌ల మొత్తం విలువ 9,960 కోట్ల డాలర్లు. అందులో రాబిన్‌హుడ్‌ అనే ఫిన్‌టెక్‌ కంపెనీదే అత్యధిక (850 కోట్ల డాలర్లు) విలువ
  7. భారతీయ సంతతి వ్యక్తులకు చెందిన 61 యునికార్న్‌లలో మూడింట రెండొంతులు విదేశాల్లో ఉండగా.. అందులో అమెరికా, సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్నవే అధికం
  8. ప్రపంచంలోని మొత్తం యునికార్న్‌లు 586. ఇవి 29 దేశాల్లోని 145 నగాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి 
  9. జూ ఇండియన్‌ యునికార్న్‌ల రాజధాని బెంగళూరు. ఈ నగరంలో 8 ఉన్నాయి 
  10. మన దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌ పేటీఎం. దీని ప్రస్తుత విలువ 16 బిలియన్‌ డాలర్లు. యంగెస్ట్‌ యునికార్న్‌ ఓలా ఎలక్ట్రిక్‌ 2017లో ప్రారంభమైంది
  11. భారత్‌లోని స్టార్ట్‌పలకు యునికార్న్‌గా ఎదిగేందుకు సరాసరిగా 7 సంవత్సరాలు పడుతుండగా.. చైనాలో 5.5 ఏళ్లు, అమెరికాలో 6.5 ఏళ్లు పడుతోంది 
  12. దేశీయ యునికార్న్‌ల వ్యవస్థాపకుల్లో చాలామంది ఐఐటీల్లో చదువుకున్నవారే. అందులో 36 మంది ఐఐటీ-ఢిల్లీలో చదువుకున్నారు
  13. మన యునికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 104 మంది మగవారే. కేవలం ఐదుగురే మహిళలు. 


Updated Date - 2020-08-05T06:41:26+05:30 IST