Abn logo
May 6 2021 @ 01:22AM

45 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత


ఇద్దరు అరెస్టు

గిద్దలూరు టౌన్‌, మే5 : పేదలకు ఇవ్వాల్సిన బియ్యం అక్రమంగా తరలిపోతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వాహనాన్ని వెంబడించి అందులో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం లైలాండ్‌ వాహనంలో 45 సంచులు (50కిలోల చొప్పున) రేషన్‌ బియ్యం తరలిపోతుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. గిద్దలూరు మండలం మోడంపల్లి గ్రామసమీపంలో నంద్యాల వైపు వెలుతుండగా పోలీసులు అడ్డుకుని వాహనాన్ని తనిఖీ చేయగా ఆవాహనంలో 45 సంచుల బియ్యం ఉన్నాయి. డ్రైవర్‌ను, వాహనంలోని మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రవీంద్రరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement