Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై కీలక విషయాలు వెల్లడించిన రిటైర్డ్ డీజీ

హైదరాబాద్: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన బాధాకరమని ఆర్మీ రిటైర్డ్ డీజీ ఎంవీ కృష్ణారావు అన్నారు. గురువారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ మేఘాల వల్ల విజిబిలిటీ సున్నాకి పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. హెలికాప్టర్ బయలు దేరిన సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని...అయితే తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ఉన్నాయని, వర్షం పడకపోయినా మేఘాలు ఉన్నాయని చెప్పారు. విమానాల మాదిరి 30 వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్‌లు ఎగరవని, కేవలం 2వేల అడుగులు ఎత్తులోనే ఎగురుతాయని తెలిపారు. అనుకోకుండా ఒక మేఘంలోకి ఎంటర్ అవడంతో ఏమి కనిపించక పోవడం హెలికాప్టర్‌కు ఉన్న రోటర్స్‌లో ఒకటి చెట్టుకు తగలడంతో ఒక్కసారిగా కూలిపోయిందని వివరించారు. ఎంఐ70 హెలికాప్టర్లు అంత్యంత టెక్నాలజీతో ఉన్న హెలికాప్టర్లని ఆయన చెప్పారు.


ఈ హెలికాప్టర్‌లు కేవలం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఆర్మీ డీజీలు మాత్రమే ఉపయోగిస్తారన్నారు. హెలికాప్టర్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కేవలం వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బ్లాక్ బాక్స్‌లో ఉన్న సీవీఆర్, డీవీఆర్‌ను డీ కోడింగ్ చేస్తే ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలుస్తుందన్నారు. పైలెట్లు చివరిగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ సీవీఆర్‌లో రికార్డ్ అయి ఉంటాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సౌందర్య, బాలయోగి వాడిన హెలికాప్టర్లకు ఈ హెలికాప్టర్‌కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. బిపిన్ రావత్ వాడిన హెలికాప్టర్‌కు రెండు ఇంజిన్లు ఉంటాయని, ఆ హెలికాప్టర్ కంటే ఈ  MI70 చాలా అంత్యంత టెక్నాలజీతో రూపొందని వెల్లడించారు. కేవలం ఈ దుర్ఘటన క్లియర్ ఆక్సిడెంట్ తప్ప వేరే కోణాలు ఏమి లేవని తెలుస్తుందన్నారు. రెండు రోజుల్లో ప్రమాదానికి సంబంధించిన రిపోర్ట్ వస్తుందని, ఆ తరువాత మరికొన్ని విషయాలు బయట పడతాయని కృష్ణారావు పేర్కొన్నారు. 


Advertisement
Advertisement