Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 29 : ఆర్టీసీ ఉద్యోగులకు వివిధ రూపాల్లో పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు కోరారు. సోమవారం స్థానిక ఫోరం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ల్లో ఆక్యుపెన్సీ రేటుతోపాటు రోజురోజుకు ఆదాయం పెరగడం వల్ల సంస్థ లా భాల్లోకి రావడం సంతోషమని  అన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరిగినందున 2019 జనవరి నుంచి నవంబరు వరకు రిటైర్డు అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నెల రోజుల వేతనం కూడా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, సంస్థ యం.డి. సజ్జనార్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కనీస పెన్షన్‌ పెంపుదల కోసం డిసెంబరు 19న ఉత్తరప్రదేశ్‌లోని ల క్నోలో రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విశ్రాంత ఉద్యోగుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి బస్వరాజ్‌ తెలిపారు. ఈ సమావే శంలో ఉపాధ్యక్షులు జి.బి.పాల్‌, నారాయణ, కార్యదర్శి గోపి, కుమార్‌, రాజు, బుచ్చన్న, శివ రాములు గౌడ్‌, ఆరీఫ్‌, సాదత్‌అలి, ఉమేష్‌ కుమార్‌, ఎల్లప్ప, రియాజొద్దీన్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement