విశ్రాంత హెచ్‌ఎం రామ్‌నారాయణ్‌సింగ్‌ మృతి

ABN , First Publish Date - 2021-04-22T06:29:19+05:30 IST

ప్రముఖ ఆర్‌ఎంపీ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రామ్‌నారాయణ్‌ సింగ్‌(87) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు.

విశ్రాంత హెచ్‌ఎం రామ్‌నారాయణ్‌సింగ్‌ మృతి

తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 21: ప్రముఖ ఆర్‌ఎంపీ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రామ్‌నారాయణ్‌ సింగ్‌(87) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు.తిరుపతికి చెందిన రామ్‌నారాయణ్‌సింగ్‌ టీటీడీ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా సేవలందిం చారు. అనంతరం ఎస్జీఎస్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా రిటైరయ్యారు. తిరుపతిలోని పలువురు రాజకీయ వేత్తలు, ప్రముఖ డాక్టర్లు ఈయన వద్ద విద్యనభ్యసించినవారే. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే 1970నుంచి ఆర్‌ఎంపీగా వైద్యసేవలందించారు. 2019వరకు ఈయన వైద్యసేవలు కొనసాగాయి. ఈయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. కుమారుడు బెంగళూరులోని ఒరాకిల్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-22T06:29:19+05:30 IST