Abn logo
Mar 16 2021 @ 16:02PM

కేంద్రాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులా..: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహం కేసులా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతు ఉద్య‌మానికి మ‌ద్ద‌తిచ్చార‌న్న ఒకే ఒక్క కార‌ణంతో దిశ ర‌విపై దేశ ద్రోహం కేసు న‌మోదు చేశారని ధ్వజమెత్తారు.కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించినా, బాధ్య‌త గుర్తు చేస్తే వారిపై 124A కింద కేసు న‌మోదు చేశారని చెప్పారు.జ‌న‌వ‌రి 26న రైతు ర్యాలీ సంద‌ర్భంగా రైతుల‌పై దేశ ద్రోహం కేసులు పెట్టారని మండిపడ్డారు.దేశ ద్రోహం కేసులు  కోర్టుల్లో విచార‌ణ‌కు  రాకుండా  అడ్డుకుంటున్నారుని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.కోర్టుల్లో కేసుల పెండింగ్‌తో ఉద్యోగాలు, పాస్‌పోర్టులు రాక యువ‌త ఇబ్బందులు ప‌డుతోందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 2014 నుంచి  న‌మోదైన దేశ ద్రోహం కేసుల వివ‌రాలు వెల్ల‌డించాల‌ని అడిగితే కేంద్ర హోం శాఖ నుంచి  స‌రైన స‌మాధానం రాలేదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


తెలంగాణ మరిన్ని...