Advertisement
Advertisement
Abn logo
Advertisement

నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: రేవంత్‌రెడ్డి

నల్లగొండ: రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలనతో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమవుతోందని, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా వర్గ విభేదాలు లేకుండా ఐక్యంగా పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో గెలవడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షసపాలన అంతమొందే రోజులు దగ్గర పడ్డాయన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement