రేవంత్‌రెడ్డి.. వాస్తవాలు తెలుసుకో

ABN , First Publish Date - 2022-07-08T05:39:42+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు గందె చంద్రకాంత్‌ పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి.. వాస్తవాలు తెలుసుకో
పేటలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు గందె చంద్రకాంత్‌

నారాయణపేట, జూలై 7 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు గందె చంద్రకాంత్‌ పేర్కొన్నారు. గురువారం టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డిపై చేసిన అను చిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలి పారు. పేట కాంగ్రెస్‌ నాయకులు తెలిపిన కంసాన్‌ పల్లి, బొమ్మన్‌పాడ్‌ శివారులో 1024.15 గుంటల భూమి విషయంలో 1400 ఎకరాల భూమిలో 200 ఎకరాలు రైతులు తీసుకొని, మిగిలిన 1200 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకోల్పుతామని ఎమ్మెల్యే చెప్పారని రేవంత్‌రెడ్డి అనడం తగదన్నా రు. 1024 ఎకరాల భూమిని 1400 ఎకరాలని, రైతులు సాగు చేస్తున్న పొలం 250 నుంచి 300 ఎకరాలు మాత్రమే ఉండగా మిగతా భూమి సాగుకు అనుకూలంగా లేదని గుట్టల ప్రాంత మన్నారు. సాగుకు అనుకూలంగా లేని దాదాపు 800 ఎకరాల భూమిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితే మూడు నుంచి నాలుగు వేల మందికి ఉపాధి కల్గుతోందన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు రైతుల తో ఉద్యమం, ధర్నాలు చేయించడం వల్ల పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పే ప్రతిపాదనను ఎమ్మెల్యే విరమించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకొని పదవికి తగ్గట్లుగా మాట్లాడా లని హితవు పలికారు. 

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి..

మరికల్‌ : నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించడం తగదని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లంబడి తిరుపతయ్య పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచ్చలేని నాయకుడుగా ఎదిగి నారాయణపేటను అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంటనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ మతీన్‌, కృష్ణారెడ్డి, కొండారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నారాయణ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

దిష్టబొమ్మ దహనం..

దామరగిద్ద : ఎమెమల్యే ఎస్‌ఆర్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆశన్న, సింగిల్‌ విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి క్షమాపన చెప్పాలని లేకుంటే అందోళన చేపడుతా మని హెచ్చరించారు. అంతకుముందు కంసాన్‌పల్లి లో టీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ భీమయ్యగౌడ్‌, గుర్నథ్‌గౌడ్‌, అశోక్‌, అశోక్‌గౌడ్‌, భీంరెడ్డి, కన్కిరెడ్డి, కోప్షన్‌మెంబర్‌ ఉస్మాన్‌, శరణప్ప, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.



Updated Date - 2022-07-08T05:39:42+05:30 IST