Abn logo
Oct 25 2021 @ 18:32PM

రాజీవ్‌గాంధీ విగ్రహానికి గులాబీ జెండాలు: రేవంత్

హైదరాబాద్: రహదారులను గులాబీ మయం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి గులాబీ జెండాలు తగిలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ టీఆర్ఎస్‌ ఇష్టానుసారం వ్యవహరిస్తుందన్నారు. టీఆర్ఎస్‌ నేతల అరాచకాలకు అదుపులేకుండా పోతుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో అన్నివర్గాలను మోసం చేశారని ఆరోపించారు. తెలుగు తల్లిని నాడు కేసీఆర్‌ దూషించారని అన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి విగ్రహం ప్రధానంగా కనిపించిందన్నారు. ఉన్నతస్థాయికి చేరడానికి కారణమైన ఏ ఒక్కరినీ సభలో ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌ నడమంత్రపు సిరితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...