రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై రేవంత్ హర్షం

ABN , First Publish Date - 2021-07-26T01:54:51+05:30 IST

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తించి అంతర్జాతీయ ఖ్యాతి లభించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హర్షం వక్తం చేశారు.

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై రేవంత్ హర్షం

హైదరాబాద్: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తించి అంతర్జాతీయ ఖ్యాతి లభించడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హర్షం వక్తం చేశారు. కాకతీయ వారసత్వ సంపద, శిల్పకళా నైపుణ్యాన్ని యునెస్కో గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. ములుగు ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయాన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. తెలంగాణలోని రామప్ప దేవాలయానికి గుర్తింపునిస్తూ యునెస్కో తాజాగా ప్రకటించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2021-07-26T01:54:51+05:30 IST