TPCC Chief Revanth Reddy కీలక నిర్ణయం.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో.. బ్రేకులు వేస్తుందో..!?

ABN , First Publish Date - 2021-12-20T00:35:24+05:30 IST

టీపీసీసీ చీఫ్ నిర్ణయానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక బ్రేకులు వేస్తుందా? అనే చర్చ హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది..

TPCC Chief Revanth Reddy కీలక నిర్ణయం.. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో.. బ్రేకులు వేస్తుందో..!?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళనకు రంగం సిద్ధం అయింది. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయి నుంచి శ్రీకారం చుట్టాలని టీపీసీసీ పెద్దలు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా మొదట కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల మార్పునకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే టీపీసీసీ చీఫ్ నిర్ణయానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక బ్రేకులు వేస్తుందా? అనే చర్చ హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.. అసలు ఈ కథేంటో పూర్తి వివరాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఈ విషయంలో రేవంత్ సక్సెస్..

తెలంగాణలో అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రక్షాళనతో ట్రీట్‌మెంట్ చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీకి కంట్లో నలుసుగా మారిన నాయకులు, పనిచేయని నేతలను ఇక ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ముందు... పార్టీలో పట్టుదలతో పనిచేసే వారికి ప్రాధాన్యం పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీని పరుగులు పెట్టించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో పార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. అలాగే ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ నాయకులను ఏకం చేయడంలోనూ సక్సెస్ అవుతున్నారు.


ఏం జరుగుతుందో..!

అయితే ఇటీవల పార్టీ శిక్షణా తరగతులలో జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గం చేసిన గొడవను ఉదాహరణగా చూపుతూ.. పార్టీలో పనిచేయడం ఎంత ముఖ్యమో, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని మెజారిటీ నేతలు వాదించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే మంచిదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో కూడా మార్పులు అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అయితే ఇప్పటికే పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, నేతల మధ్య కోల్డ్ వార్‌లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా డీసీసీ అధ్యక్షులను మార్చే ప్రయత్నం చేయడం వల్ల పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌.. టీపీసీసీ ప్రతిపాదనపై సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో రేవంత్‌రెడ్డి నిర్ణయానికి హైకమాండ్ అనుమతి ఇస్తుందో..? లేక అడ్డుకుంటుందో..? చూడాలి.


హస్తిన పెద్దలు కోరిన రేవంత్..!

జిల్లా అధ్యక్షుల పనితీరుపై ఇప్పటికే హైకమాండ్‌కు కూడా రిపోర్టులు అందినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా మార్పులు, చేర్పులు చేయాలని హస్తిన పెద్దలను టీపీసీసీ చీఫ్ కోరినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలు చేస్తూ, పార్టీకి తలనొప్పిగా మారిన అధ్యక్షులను తొలగించి, కొత్తవారిని నియమించే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి రేవంత్‌ రెడ్డి విన్నవించారు. అయితే అదే సమయంలో రేవంత్ చర్యలను పార్టీలోని కొందరు సీనియర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. తమ అనుకూలురు, అనుచరులనే సాకుతో కొందరు. తమ హయాంలో నియామకం అయినవారిని మార్చితే ఎలా? అని మరికొందరు డీసీసీలు మార్పులు, చేర్పుల ప్రక్రియను అడ్డుకోవడానికి ఎత్తులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.


రేవంత్ డిసైడ్ అయిపోయినట్లే..

ఇక డీసీసీ అధ్యక్షులను మార్చడంపైనా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల అధ్యక్షుల పనితీరుపై టీపీసీసీ ప్రత్యేక నిఘా పెట్టింది. డీసీసీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, టీపీసీసీ ఇచ్చిన కార్యాచరణ అమలు చేస్తున్నారా? లేదా? అనే అంశాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. వారి పనితీరును సమీక్షిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల పనితీరుపై వచ్చిన రిపోర్టుల ఆధారంగా.. వారిలో మెజారిటీ అధ్యక్షులు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నేతల వర్గాలుగా డీసీసీలు విడిపోయి.. టీపీసీసీ ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదట. పార్టీ కార్యక్రమాలను కూడా యాక్టివ్‌గా నిర్వహించడం లేదట. దీంతో పార్టీ కోసం పట్టుదలగా పని చేయడమే ప్రాతిపదికగా డీసీసీల ప్రక్షాళనకు రేవంత్‌రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


151 నుంచి 12కు కుదింపు..

రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక.. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న సీనియర్ నేతలను ఒక్కొక్కరిని లైనులోకి తీసుకురావడంలో దాదాపుగా విజయం సాధిస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ బలోపేతంపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్‌గా దృష్టిని కేంద్రీకరించారు. దీనికోసం పార్టీలో కిందిస్థాయి నుంచి సమూల మార్పులు- చేర్పులు చేయడానికి రెడీ అయ్యారు. టీపీసీసీ కార్యవర్గం నుంచే ఆ మార్పులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. 150కిపైగా ఉన్న అధికార ప్రతినిధుల సంఖ్యను 12 మందికి కుదించారు. టీపీసీసీ అధ్యక్షుడి సూచనతో కొత్తగా అధికార ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించారు. అలాగే గ్రామ, మండల, బ్లాక్ స్థాయిల్లో అవసరం ఉన్న చోట్ల అధ్యక్షులను మారుస్తున్నారు



Updated Date - 2021-12-20T00:35:24+05:30 IST