భీమవరంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2021-07-07T16:45:34+05:30 IST

తెలంగాణలోనేగాక.. ఏపీలోను ఆయన ఫ్లెక్సీలు భారీస్థాయిలో దర్శనమిస్తున్నాయి.

భీమవరంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు

పశ్చిమ గోదావరి జిల్లా: మరికాసేపట్లో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డికి అభిమానులు పెద్దఎత్తున ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇవాళ ప్రమాణస్వీకరం కావడంతో తెలంగాణలోనేగాక.. ఏపీలోను ఆయన ఫ్లెక్సీలు భారీస్థాయిలో దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో రేవంత్ రెడ్డి అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.


Updated Date - 2021-07-07T16:45:34+05:30 IST