సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-21T23:52:38+05:30 IST

సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు: రేవంత్ రెడ్డి

సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు: రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే ఉద్యమకారులు విసుగుచెందారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా సామ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.


ఏ ఆశయం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పై విశ్మాసం సడలిపోయిందని చెప్పారు. నిరుద్యోగులకు తెలంగాణలోని ప్రైవేటు సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించాలని సామ వెంకట్ రెడ్డి తొలి నుంచి ఉద్యమాలు చేశారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వెంకట్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల భూములు గుంజుకుని తక్కువ ధరకే పరిశ్రమలకు కేటాయించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-07-21T23:52:38+05:30 IST