ఒత్తిళ్లకు లొంగిపోయారు.. రిటర్నింగ్ అధికారిపై రేవంత్ ఫైర్

ABN , First Publish Date - 2020-11-23T02:23:30+05:30 IST

గాజులరామారం రిటర్నింగ్ అధికారి ఒత్తిళ్లకు లొంగి శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాల తర్వాత ..

ఒత్తిళ్లకు లొంగిపోయారు.. రిటర్నింగ్ అధికారిపై రేవంత్ ఫైర్

హైదరాబాద్: గాజులరామారం రిటర్నింగ్ అధికారి ఒత్తిళ్లకు లొంగి శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా అభ్యర్థుల జాబితాలో పేరు చేర్చకుండా రిటర్నింగ్ అధికారి తాత్సారం చేశారని ఆయన మండిపడ్డారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామంటే చివరికి అభ్యర్థి పేరు చేర్చారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ స్థానికేతరులను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌..యూట్యూబ్ చానళ్లకు డబ్బులిచ్చి ప్రచారం చేయించుకుంటోందన్నారు. హైదరాబాద్‌ ప్రజలు అన్నీ గమనించి తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాసమస్యలపై పోరాడే శక్తినివ్వండని రేవంత్‌రెడ్డి కోరారు. 

Updated Date - 2020-11-23T02:23:30+05:30 IST