Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏసీబీ వలలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్

తిరుపతి: మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రఫీ దొరికిపోయాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం నరసింహా రెడ్డి అనే వ్యక్తి తన ఆస్తి పన్ను మార్పు కోసం రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రఫీని కలిశాడు. అయితే పని కోసం బాధితుడి దగ్గర రఫీ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను నరసింహా రెడ్డి సంప్రదించాడు. నరసింహా రెడ్డి నుంచి రూ.9 వేలు నగదు తీసుకుంటూ ఉండగా రఫీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగరంలోని శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో ఈ వ్యవహారమంతా చోటుచేసుకుంది. 

Advertisement
Advertisement