రెవెన్యూ స్పందనను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-22T05:38:24+05:30 IST

గ్రామ సచివాలయా ల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ స్పందనను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ యు.శ్రీని వాసరావు అన్నారు.

రెవెన్యూ స్పందనను సద్వినియోగం చేసుకోవాలి
మార్టూరులో అర్జీ స్వీకరిస్తున్న తహసీల్దార్‌ వెంకటరెడ్డి

చినగంజాం, అక్టోబరు 21: గ్రామ సచివాలయా ల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ స్పందనను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ యు.శ్రీని వాసరావు అన్నారు. మండలంలోని కడవకుదురు, మున్నంవారిపాలెం, చినగంజాం-1 గ్రామ సచివాల యాల్లో జరుగుతున్న రెవెన్యూ స్పందన కార్యక్రమా న్ని గురువారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. మండల పరిధిలోని 13 గ్రామ సచివాలయాల్లో జరిగిన రెవెన్యూ స్పం దనకు 18 ఆర్జీలు వచ్చినట్టు చెప్పారు. అడంగల్‌ సవరణలకు ఒకటి, మ్యుటేషన్‌కు- 13, అక్రమ ణలకు సంబంధించి 3, ఇతర సమస్యలకు సం బంధించి ఒక ఆర్జీ వచ్చినట్లు తెలిపారు. కార్య క్రమంలో కడవకుదురు, చినగంజాం గ్రామ స ర్పంచ్‌లు జి.శివకుమారి, రాయని ఆత్మరావు,  వీ ఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. 

మార్టూరు: మండలంలోని 18 గ్రామ సచివా లయాల్లో గురువారం జరిగిన రెవెన్యూ స్పందన కు 125 అర్జీలు వచ్చాయని తహసీల్దార్‌ ఈదా వెం కటరెడ్డి తెలిపారు. మండలంలోని కోనంకి గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.  యద్దన పూడి మండలంలో 33 అర్జీలు వచ్చాయని తహసీ ల్దార్‌ వెంకటరత్నం తెలిపారు.

చీరాల: భూ సంబంధిత సమస్యల పరిష్కరానికి ప్రత్యేక స్పందన కార్యక్రమం ఎంతో ఉపయోగపడు తుందని తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌ అన్నారు. గురువా రం తోటవారిపాలెం, విజయ్‌నగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన స్పందన కా ర్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్జీలు స్వీకరిం చారు. కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీకాంత్‌, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో జరి గిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్‌ సంధ్య శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ శుక్రవారం కూడా స్పందన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వెలవెల..

పర్చూరు, అక్టోబరు 21: భూ సమస్యలు, సర్వే సమస్యలు ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు ఏర్పాటుచేసిన రెవెన్యూ స్పందనకు స్పందన కరువయింది. మండలంలోని ఆయా గ్రామ సచి వాలయాల వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యక్రమం నిర్వహించే విధంగా అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పర్చూరులో ఏర్పాటుచేసిన రెవెన్యూ స్పందనకు ఉదయం 11గంటల వరకు ఒక్క అర్జీకూడా రాకపో వటం ఇందుకు నిదర్శనం. దీంతో ఆయా సచివా లయాలు అర్జీదారులు లేక వెలవెలబోయాయి. మొ త్తం మండలంలో 20 సచివాలయాలకు సంబం ధించి 39 అర్జీలు అందినట్టు తహసీల్దార్‌ వెంకట రెడ్డి తెలిపారు. 

కారంచేడు మండలంలో నిర్వహించిన రెవెన్యూ స్పందనకు 32 అర్జీలు అందినట్లు తహసీల్దార్‌ సీతా రత్నం తెలిపారు. త్వరితగతిన అర్జీలను పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటా మన్నారు. 

Updated Date - 2021-10-22T05:38:24+05:30 IST