సచివాలయాల్లో రెవెన్యూ స్పందన

ABN , First Publish Date - 2021-10-22T06:36:13+05:30 IST

రెవెన్యూ స్పందన కార్యక్రమంలో తొలిరోజు కందుకూరు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో వివిధ సమస్యలపై 219 అర్జీలు అందాయని తహసీల్దార్‌ డి.సీతారామయ్య తెలిపారు.

సచివాలయాల్లో రెవెన్యూ స్పందన
కందుకూరులో అర్జీల వివరాలు తెలుసుకుంటున్న జేసీ, సబ్‌కలెక్టర్‌

కందుకూరు, అక్టోబరు 21: రెవెన్యూ స్పందన కార్యక్రమంలో తొలిరోజు కందుకూరు అర్బన్‌, రూరల్‌ మండలాల్లో వివిధ సమస్యలపై 219 అర్జీలు అందాయని తహసీల్దార్‌ డి.సీతారామయ్య తెలిపారు. కందుకూరు రూరల్‌ మండల పరిధిలోని గ్రామాలలో 147 అర్జీలు రాగా పట్టణ ంలో 72 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో 193 అర్జీలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడం కూడా పూర్తయిందన్నారు. సచివాలయాలలో నిర్వహించిన స్పందన కార్యక్రమాలను జాయింట్‌ కలెక్టరు చేతన్‌, సబ్‌ కలెక్టరు అపరాజిత సింగ్‌లు పరిశీలించారు. మండలంలోని కొండముడుసుపాలెం, పట్టణ ంలోని శ్రీనగర్‌కాలనీ సచివాలయాలను వారు సందర్శించి సూచనలు చేశారు. అనంతరం మహదేవపురం, పలుకూరు సచివాలయాలను సబ్‌ కలెక్టరు అపరాజితసింగ్‌  సందర్శించి అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు.

పామూరు : మండలంలో రెండు రోజుల పాటు జరిగే రెవెన్యూ స్పందనను అర్జీ దారులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్‌ సీహెచ్‌ ఉష సూచించారు. రెవెన్యూ స్పందన కార్యక్రమంలో భాగంగా మండలంలోని బలిజపాలెం, తూర్పుకట్టకిందపల్లి, ఇనిమెర్ల, కంభాలదిన్నె గ్రామ సచివాలయాలను ఆమె సందర్శించి భూ సంబంధి రికార్డులను పరిశీలించారు. భూముల లొకేషన్‌, వెబ్‌ల్యాండ్‌, పాసుపుస్తకాలు, ఆన్‌లైన్‌, ఇళ్ళ స్థలాలు, భూ తగాదాలు తదితర అంశాలకు సంభందించి 146 ఽధరఖాస్తులు అందినట్లు ఆమె తెలిపారు. 

దర్శి : రెవెన్యూ స్పందన కార్యక్రమంలో దాఖలైన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని దర్శి తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని 23 సచివాలయాల్లో గురువారం రెవెన్యూ స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు సిబ్బంది ప్రజల  నుంచి వచ్చిన 200 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ వివాదాలు ఆన్‌లైన్‌ 22/ఏ, చుక్కల భూములు తదితర సమస్యలపై 200 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లోనూ సదస్సులు జరిగాయి. 

లింగసముద్రం : రెవెన్యూ స్పందనలో 13 సచివాలయాల నుంచి 121 అర్జీలు వచ్చాయని తహసీల్దార్‌ ఆర్‌ బ్రహ్మయ్య చెప్పారు. ప్రజల నుంచి ఎక్కువగా డీకే. అసైన్‌మెంట్‌ పట్టాలమార్పులు, భూముల ఆన్‌లైన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇంటిస్థల పట్టాలు మంజూరు గురించి అర్జీలు వచ్చాయన్నారు. ఈ సందర్బంగా లింగసముద్రం పంచాయతీలోని జంగంరెడ్డిపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి  చెందిన మహిళలు గ్రామ సర్వే నంబరు 110లోని ప్రభుత్వ భూమిలో తమకు ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని  వీఆర్వో గోవిందరాజులుకు అర్జీలు సమర్పించారు. 

పామూరు :  రెవెన్యూ స్పందనకు పామూరులో అర్జీదారుల నుండి స్పందన కరువైంది. పామూరు పంచాయతీ కార్యాలయంలో 4 సచివాలయాల పరిధిలో కలిపి రెవెన్యూ స్పందన కార్యక్రమం గురువారం నిర్వహించారు.  కార్యక్రమానికి అర్జీలు రాక వెలవెలబోయాయి. 

సీఎ్‌సపురం : మండలంలోని గ్రామ సచివాలయాలలో గురువారం నిర్వహించిన రెవెన్యూ స్పందన కార్యక్రమానికి ప్రజలు ఆసక్తి చూపించలేదు.  పలు గ్రామాలలో అసలు ఒక్క అర్జీ కూడా రాలేదు. మండలంలో మొత్తం వివిధ భూ సమస్యలపై 27 అర్జీలు వచ్చినట్లు ఆర్‌ఐ విజయ్‌భాష్కర్‌ తెలిపారు. అత్యధికంగా మండలంలోని వీ.భైలు గ్రామంలో 9, అయ్యలూరివారిపల్లి గ్రామంలో 8 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-22T06:36:13+05:30 IST