Abn logo
Jun 12 2021 @ 00:23AM

శ్రీగంధం, టేకు మొక్కలతో రాష్ట్రానికి ఆదాయం

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి


ములుగు జూన్‌ 11: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే అటవీ ప్రాంతాల్లో శ్రీ గంధం, టేకు మొక్కలను పెంచినట్లయితే ఆ దాయం పెరుగుతుందని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉద్యానవన సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెంట్‌ కార్యాలయంలో రాష్ట్ర ఫారెస్ట్‌ అధికారుల అవగాహన సదస్సును  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంటేరు ప్రతా్‌పరెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో ఈ స్థలాల్లో నీలగిరి మొక్కలు నాటడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం అటవీ ప్రాంతాల్లో రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా మొక్కలు నాటాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.


వర్షాలు పడిన వెంటనే త్రిబుల్‌ ఆర్‌ రోడ్డు చుట్టూ లక్ష శ్రీగంధం, టేకు మొక్కలను నాటడానికి చర్యలు చేపడుతామని వివరించారు. సదస్సులో ఫారెస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ బాబు హార్టికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ భాగ్యలక్ష్మి, ఎండీ అక్బర్‌తో పాటు రాష్ట్ర ఫారెస్ట్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement