కుటీర పరిశ్రమలతో ఆదాయం

ABN , First Publish Date - 2022-01-20T04:48:43+05:30 IST

కోళ్లపరిశ్రమ, పాలు, మాంసం ఆధారిత ఉత్పత్తుల ద్వారా గ్రామీణ ప్రాంత ఆదా యం పెరుగుతుందని పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.వైకుంఠరావు పేర్కొన్నారు.

కుటీర పరిశ్రమలతో ఆదాయం
పెరటి కోళ్లను పంపిణీ చేస్తున్న పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.వైకుంఠరావు

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 19: కోళ్లపరిశ్రమ, పాలు, మాంసం ఆధారిత ఉత్పత్తుల ద్వారా గ్రామీణ ప్రాంత ఆదా యం పెరుగుతుందని పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.వైకుంఠరావు పేర్కొన్నారు. మండలంలోని గోపవరం గ్రామ సమీపంలోగల పశువైద్య కళాశాలలో బుధవారం కోళ్లశాఖ విభాగం ఆధ్వర్యంలో 400 పెరటికోళ్లపై శిక్షణ పొందిన రైతులు, మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీబీటీ పరిశోధన ప్రాజెక్టు ద్వారా 6 నుంచి 7 వారాలు పెంచిన పెరటి కోళ్లను మహిళల స్వయం ఉపాధికి పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డీబీటీ ప్రాజెక్టు ప్రధాన పర్యవేక్షడు డాక్టర్‌ తిరుపతిరెడ్డి, ప్రాజెక్టు సహాయ పర్యవేక్షకుడు డాక్టర్‌ సాయిదిలీ్‌పగుప్త, డీఆర్‌డీఏ అధికారి గౌస్‌బాష, పశువైద్య కళాశాల సహాయ సిబ్బంది బాలుడు, పెద్దమస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:48:43+05:30 IST