Abn logo
Sep 23 2021 @ 00:34AM

నర్సరీ, ఉపాధిహామీ పనులపై సమీక్ష

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో

ఎలిగేడు, సెప్టెంబరు 22 : మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో డీఆర్‌డీవో శ్రీ ధర్‌, డిప్యూటీ ఫారెస్ట్‌రేంజ్‌ అధికారి రాఘవేంద్రరావు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తితో కలిసి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులు వన సేవకులకు హరితహారం కింద 2021 -22కు గాను నర్సరీ పెంపకం, ఉపాధిహామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. గతంలో పెంచి, పంపిణీ చేయగా మిగిలిన మొక్కల వివరాలు, హరితహారం 2021-22కు నర్సరీల ఏర్పాటు, గ్రామాలవారిగా నర్సరీల వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీవో శ్రావణ్‌కుమార్‌, ఏపీవో సదా నందం, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.