Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ నెల చివరి నాటికి వంద శాతం పూర్తి చేయాలి

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి 

- కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌పై సమీక్ష

గద్వాల క్రైం, నవంబరు 30 : రబీ సీజన్‌లో ఇచ్చిన క్లస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను డిసెంబర్‌ 31 వరకు వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. ఆర్‌ఐలు, ఎమ్మార్వో లు, ఇన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, రైస్‌ మిల్లర్లతో కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మంగళ వారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైస్‌ మిల్లులను 24 గంటలు నడపాలని సూచించారు. ప్రతీ రోజు బియ్యాన్ని మిల్లుల నుంచి సివిల్‌ సప్లై గోదాములకు పంపించాలన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన ఆర్‌ఐలు ప్రతీరోజు మిల్లులను పర్యవేక్షణ చేసి రోజు వారి లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లులో స్టాక్‌ వివరాలను తెలుసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, ఆర్డీవో రాములు, డీఎస్‌వో రేవతి, అధికారులు పాల్గొన్నారు. 


మద్యం దుకాణాలకు లక్కీడిప్‌ 

జిల్లాలో ఖరారు కాని మూడు మద్యం దుకాణాలను మంగళవారం లక్కీడిప్‌ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ధరూరులోని రెండు (17, 18), గట్టులో ఒకటి (19) మద్యం దుకాణాలను కలెక్టర్‌ లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 36 మద్యం దుకాణాలకు గాను 33 దుకాణాలను ఈ నెల 20న లాటరీ పద్ధతిలో ఎంపిక కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన మూడు దుకాణాలకు రీ నోటిఫికేషన్‌ ఇవ్వగా 81 దరఖాస్తులు వచ్చాయన్నారు. లక్కీడిప్‌లో ధరూర్‌ మండలంలోని 17వ దుకాణాన్ని ధరణికుమార్‌రెడ్డి, 18వ దుకాణాన్ని ఉపేంద్రగౌడు, గట్టు మండలం లోని 19వ దుకాణాన్ని సుధాకర్‌రెడ్డి దక్కించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సైదులు, సీఐ గోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement