Abn logo
Aug 14 2021 @ 15:06PM

దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష చేశాం: సీఎస్

కరీంనగర్: దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష చేశామని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. నగదు నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లో పడుతుందని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. 15 మందికి మాత్రమే సీఎం చేతుల మీదుగా దళిత బంధు రుణాన్ని అంజేస్తారని సోమేష్‌కుమార్ తెలిపారు. హుజూరాబాద్‌లో దళిత బంధు తొలి లబ్ధిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు తెలంగాణ దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు.

క్రైమ్ మరిన్ని...