Abn logo
Sep 22 2021 @ 23:22PM

ఉపాధిహామీ పనులపై సమీక్ష

కోటపల్లిలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో శేషాద్రి

చెన్నూరు, సెప్టెంబరు 22: ఉపాధిహామీ పనులపై బుధవారం  డీఆర్‌డీవో శేషాద్రి పలు చోట్ల సమీక్ష నిర్వహించారు. చెన్నూరు మండ లంలోని ఎంపీడీవో కార్యాలయలో బుధవారం డీఆర్‌డీవో శేషాద్రి ఉపాధిహామీ పనులపై  పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలంలో ఉపాధిహామీలో జరుగుతున్న పనులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.  సమావే శంలో ఏపీవో గంగాభవానీ, ఎంపీవో బీరయ్య, ఈసీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోటపల్లి: ఉపాధిహామీ పథకం కింద గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని డీఆర్‌డీవో శేషాద్రి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా మంజూరైన నిధులు అయిన ఖర్చు, కొనసాగుతున్న పనులు, పూర్త యిన పనులు తదితర అంశాలపై గ్రామాల వారీగా సమీక్షించారు. పనులు పారదర్శకంగా  చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశం లో ఎంపీడీవో భాస్కర్‌, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, ఏపీవో వెంకటేశ్వర్‌, ఈసీ నాగేందర్‌ పాల్గొన్నారు.