వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

ABN , First Publish Date - 2020-05-30T11:06:28+05:30 IST

తరతరాలుగా రైతులు ఒకే పద్ధతిలో పంటలను సాగు చేస్తూ గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా ఇబ్బందుల

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి


కోటగిరి, మే 29 : తరతరాలుగా రైతులు ఒకే పద్ధతిలో పంటలను సాగు చేస్తూ గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని, ఈ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ రం గంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోటగిరి మండలంలోని సోంపూర్‌ గ్రామంలో శుక్రవా రం వానాకాలం 2020 వ్యవసాయ ప్రణాళికపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి సభాపతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఒకే రకమైన పంటలు పండిస్తూ మూస పద్ధతులను అవలంభించ డం వలన ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.


పంట మార్పిడి పద్ధతుల ను అవలంభించడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చన్నారు. భూ ములకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని సూచించారు. సన్నరకం పంటను సాగు చేయడం ద్వారా రైతులకు మరింత గిట్టుబాటు ధర లభి స్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 30లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో కి వచ్చిందన్నారు. 58 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. 24 లక్షల బోర్‌ వెల్స్‌తో పంటలు పండిస్తున్నారని, ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడం లేదన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్య శ్యామలం అవుతుందన్నారు. పెట్టుబడి పెట్టి పంటలు పండించిన తరువాత కొనేవారు లేక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సమస్య నుం చి గట్టెక్కించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతీ పంటను ప్రభు త్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. జూలైలో కాళే శ్వరం జలాలు నిజాంసాగర్‌కు చేరుకుంటాయన్నారు. దీంతో నిజాంసాగర్‌ ఆ యకట్టులో రెండు పంటలు పుష్కలంగా పండించుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రాంగంగానగర్‌ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. బాన్సువాడ నియోజకవ   ర్గంలో రూ.300 కోట్ల వ్యయంతో 5వేల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయా శాఖల ఆధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అభి వృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ అధికారి గోవింద్‌, ఆర్డీవో గోపిరాం, ఏఎంసీ చైర్మన్‌ గం గాధర్‌, జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఏజాజ్‌ఖాన్‌, ఎంపీటీసీ విఠల్‌, సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ, తహసీల్దార్‌ విఠల్‌, ఎంపీడీవో అతా రుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T11:06:28+05:30 IST