ఉపకారానికి ప్రతిఫలం

ABN , First Publish Date - 2021-01-01T06:29:47+05:30 IST

సజ్జనత్వంలో ఒక పూర్ణస్థితికి చేరినవాడు ఎప్పుడూ ఎదుటి వాళ్లు చేసిన చిన్న ఉపకారాన్ని కూడా మరిచిపోడు. ప్రతిగా తాను చేయవలసింది చేస్తాడు.

ఉపకారానికి ప్రతిఫలం

సజ్జనత్వంలో ఒక పూర్ణస్థితికి చేరినవాడు ఎప్పుడూ ఎదుటి వాళ్లు చేసిన చిన్న ఉపకారాన్ని కూడా మరిచిపోడు. ప్రతిగా తాను చేయవలసింది చేస్తాడు. ఆ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఓ పద్యం ద్వారా తెలుసుకుందాం.


అలఘు గుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొక డిష్టుడై తనన్‌

వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా

తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటకుల్‌ దనకిచ్చినన్‌ మహా

ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా!




కృష్ణుడు, కుచేలుడి మధ్య అనుబంధం గురించి చెబుతున్నాడు. చిన్నతనంలో కృష్ణుడు, కుచేలుడు కలిసి చదువుకున్నారట. ఆప్పుడు కుచేలుని పేరు సుధాముడు. కుచేలుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కొన్ని అటుకులు తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఆ అటుకులు తిని అనంతమైన సంపదలు ప్రసాదించాడు. తన గుణాలతో ప్రసిద్ధుడైన మహావిభవం కలిగిన ఘనుడు ఎవడైనా సరే తోటివారికి ప్రేమతో ఇస్తాడు. 


 గరికిపాటి నరసింహారావు


Updated Date - 2021-01-01T06:29:47+05:30 IST