Abn logo
Nov 28 2020 @ 04:09AM

ఆర్‌జీయూకేటీ సెట్‌ వాయిదా

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): శనివారం జరగాల్సిన ‘రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఆర్‌జీయూకేటీ సెట్‌- 2020)’ వాయిదా పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉన్నందున పరీక్షను డిసెంబరు 5కు వాయిదా వేశామని సెట్‌ కన్వీనర్‌ హరినారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు కేటాయించిన కేంద్రాలలో, హాల్‌టికెట్లలో ఎలాంటి మార్పులేదని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 88,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

Advertisement
Advertisement
Advertisement