Oct 19 2021 @ 14:35PM

RGV: సిని‘మా’లో అంతా జోకర్లే!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడు – ఎవరి మీద ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారో తెలీదు. ఇటీవల ఆయన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) వివాదంపై తనదైన స్టైల్లో స్పందించాడు. ‘మా’ ఒక సర్కస్‌ అని రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన ఆయన మంగళవారం మరో కామెంట్‌ చేశాడు. సిని‘మా’ ఓ సర్కస్‌ అని, అందులో ఉన్నవారంతా జోకర్లు అంటూ వర్మ ట్వీట్‌ చేశారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.