Abn logo
Sep 23 2020 @ 16:16PM

సుశాంత్ మమ్మల్ని బాగా వాడుకున్నాడు: రియా

Kaakateeya

తాను అమాయకురాలినని, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కావాలనే తనతోపాటు తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేస్తోందని రియా చక్రవర్తి తన బెయిల్ పిటీషన్‌లో పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అరెస్టైన హీరోయిన్ రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ గురువారానికి వాయిదా పడింది. ముంబైలో భారీ వర్షాలు పడుతున్న కారణంగా విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. 


సుశాంత్‌పై కూడా రియా పలు ఆరోపణలు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. `నేను పరిచయం కాకముందే సుశాంత్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటుంది. కొన్ని సార్లు మాత్రమే నేను సుశాంత్‌కు డ్రగ్స్ అందించాను. వాటిని నా డబ్బులతోనే కొన్నాను. డ్రగ్స్ తీసుకురావాలని తన స్టాఫ్‌ను కూడా సుశాంత్ బలవంతం చేసేవాడు. నన్ను, నా సోదరుడు షోవిక్‌ను కూడా డ్రగ్స్ కోసం ఉపయోగించుకున్నాడు. అతడి కారణంగా మేం దొరికిపోయాం. సుశాంత్ వల్ల మేమంతా మానసిక క్షోభ అనుభవిస్తున్నామ`ని రియా పేర్కొన్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement