Abn logo
Aug 10 2020 @ 17:14PM

మీడియా తనను నేరస్తురాలిగా చిత్రీకరిస్తోందంటూ సుప్రీంలో రియా పిటిషన్

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే రియా చక్రవర్తి పాత్రకు సంబంధించి ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో.. సుప్రీంలో ఆమె తాజాగా సోమవారం మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో బీహార్ పోలీసుల విచారణను తప్పుబడుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రియా.. ఇప్పుడు మీడియా వైఖరిపై పిటిషన్ దాఖలు చేసింది.


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మీడియా తనను అన్యాయంగా నేరస్తురాలిగా చిత్రీకరిస్తోందని ఆ పిటిషన్‌లో రియా ఆరోపించింది. సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశిస్తే తనకు అభ్యంతరం లేదని ఆమె పిటిషన్‌లో చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ కేసు జ్యురిస్డిక్షన్ ముంబై పరిధిలో ఉందని బీహార్ పరిధిలో కాదని ఆమె పిటిషన్‌లో చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement