Abn logo
Aug 2 2020 @ 19:18PM

రియా చక్రవర్తి గురించి షాకింగ్ విషయం వెలుగులోకి..!

పెద్దపెద్ద సూట్‌కేసులతో అర్ధరాత్రి ఇంటి నుంచి రియా చక్రవర్తి ఫ్యామిలీ అదృశ్యం

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో.. అతని కుటుంబం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు రియా ఓ అజ్ఞాత ఖాతాకు బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ముంబైలోని రియా చక్రవర్తి ఇంటికి విచారణ నిమిత్తం బీహార్ పోలీసు బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.


ఓ జాతీయ టీవీ ఛానల్ రియా ఇల్లు సూపర్‌వైజర్‌ను ఈ విషయమై సంప్రదించగా షాకింగ్ విషయం బయటికొచ్చింది. మూడు రోజుల క్రితం రియా అర్ధరాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. బ్లూ కలర్ కారులో వెళ్ళారని, పెద్దపెద్ద సూట్‌కేసులను వెంట తీసుకెళ్లారని తెలిపాడు. రియా ఉంటున్న ఈ ఇంటికి సుశాంత్ ఒకప్పుడు వచ్చాడని చెప్పాడు.

Advertisement
Advertisement
Advertisement