పోలీసుల అదుపులో బ్యాటరీల దొంగలు

ABN , First Publish Date - 2022-01-24T04:46:36+05:30 IST

కరకగూడెం, పినపాక మండలాల్లోని పలు ట్రాక్టర్ల నుంచి బ్యాలరీలను తస్కరించిన నిందితులను కరకగూడెం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌, ఏడూళ్ళ బయ్యారం ఎస్‌ఐ టవీఆర్‌ సూరి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో బ్యాటరీల దొంగలు
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కరకగూడెం, జనవరి 23: కరకగూడెం, పినపాక మండలాల్లోని పలు ట్రాక్టర్ల నుంచి బ్యాలరీలను తస్కరించిన నిందితులను కరకగూడెం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌, ఏడూళ్ళ బయ్యారం ఎస్‌ఐ టవీఆర్‌ సూరి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కరకగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కరకగూడెం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమత్‌ భట్టుపల్లి పంచాయతీ పెట్రోల్‌ బంక్‌ పరిసరాల్లో ఆదివారం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో ఆటోలో పినపాక మండలం రావిచెట్టుగూడేనికి తెల్లం నాగరాజు, పినపాక మండలం ఉప్పకకు చెందిన బూటరీ ప్రశాంత్‌, పినపాక మండలం ఏడూళ్లబయ్యారానికి చెందిన శ్రీ విజయ లక్ష్మి బ్యాటరీ షాపు వ్యక్తి గడ్డం వీర ప్రసాద్‌ అనే వ్యక్తులు బ్యాటరీలను తీసుకొని వరంగల్‌లో అమ్మేందుకు వెళ్తున్నారు. పోలీసలు గుర్తించి వారిని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు. దొంగిలిచ్చిన 21 బ్యాటరీల విలు వ రూ, 1,68000 ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చాకచక్యంగా బ్యాటరీల దొంగలను పట్టుకున్న కరకగూడెం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌ కుమార్‌, ఏడూళ్ళ బయ్యారం ఎస్‌ఐ టివిఆర్‌ సూరి, కరకగూడెం ఏఎస్‌ఐ పాపయ్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సిబ్బంది పుల్లందాస్‌, వంశీ, రాము, సుబ్బారావు, లక్ష్మణ్‌లను ఏడూళ్ళ బయ్యారం సీఐ ఐబీ రాజగోపాల్‌ అభినందించారు. 

Updated Date - 2022-01-24T04:46:36+05:30 IST