రిబ్బన్‌ పకోడీ

ABN , First Publish Date - 2021-12-16T19:15:01+05:30 IST

వరి పిండి- రెండు కప్పులు, శనగపిండి- కప్పు, నువ్వులు- స్పూను, జీలకర్ర- అర స్పూను, కారం- స్పూను,

రిబ్బన్‌ పకోడీ

కావలసిన పదార్థాలు: వరి పిండి- రెండు కప్పులు, శనగపిండి- కప్పు, నువ్వులు- స్పూను, జీలకర్ర- అర స్పూను, కారం- స్పూను, పనుపు- పావు స్పూను, వేడి నూనె- రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.


తయారుచేసే విధానం: ఓ గిన్నెలో వరి, శనగ పిండి, నువ్వులు, జీలకర్ర, కారం, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. కాచిన వేడి నూనెను వేసి స్పూనుతో బాగా కలపాలి. అవసరమైన మేర నీళ్లని చేర్చి పిండిలా చేయాలి. ఓ పాన్‌లో నూనె కాగాక జంతికల మరతో రిబ్బన్లు చుట్టి వేయించి తీస్తే కరకరలాడేటి రిబ్బన్‌ పకోడీ రెడీ.

Updated Date - 2021-12-16T19:15:01+05:30 IST