తూచ్‌.. రేషన్‌ రాదు

ABN , First Publish Date - 2020-05-27T08:59:22+05:30 IST

గుంటూరు నగర పరిధిలోని నివసించే వారంతా నిరుపేదలు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు రైస్‌కార్డు

తూచ్‌.. రేషన్‌ రాదు

కొత్తగా ఇచ్చిన కార్డుల్లో 11,060పై వేటు

ఆరు అంచెల్లో విచారణ.. మూడు నెలల క్రితం పంపిణీ

ఇప్పుడు అనర్హులు అంటారేమిటని నిలదీస్తోన్న కార్డుదారులు 


గుంటూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగర పరిధిలోని నివసించే వారంతా నిరుపేదలు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు రైస్‌కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలను ఆరు అంచెల మూల్యాంకనం చేసి మరీ మూడు నెలల క్రితం రైస్‌కార్డులు పంపిణీ చేశారు. వాటిల్లో ఇప్పుడు ఏకంగా 11,060 కార్డుదారులు రేషన్‌ పొందలేకపోతున్నారు. వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే అనంతరం గుంటూరులో లక్షా 33 వేల 574 కుటుంబాలకు కొత్త రైస్‌కార్డులు మంజూరు అయ్యాయి. ఈకేవైసీ ప్రకారం లక్షా 22 వేల 514 మంది మాత్రమే రేషన్‌ సరుకులు పొందగలుగుతున్నారు.


మిగతా వారికి ఈకేవైసీ జరగక పోతుండటంతో రేషన్‌ సరుకులు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇంకెన్ని వేల మందికి రేషన్‌ పంపిణీ కావడం లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ విషయం నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ దృష్టికి కూడా వెళ్లడంతో ఆమె దీనిపై వివరాలు సేకరించాల్సిందిగా సంబంధిత సచివాలయాల అధికారులను ఆదేశించారు. అన్ని అర్హతలు చూసిన తర్వాతనే రైస్‌ కార్డు ఇచ్చి ఇప్పుడు అనర్హులు అంటారేమిటని కార్డుదారులు నిలదీస్తోన్నారు. 


Updated Date - 2020-05-27T08:59:22+05:30 IST