ఆందోళనలో రైస్ మిల్లర్లు: దేవేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-24T21:32:46+05:30 IST

బియ్యం సేకరణపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని రెండు వేల

ఆందోళనలో రైస్ మిల్లర్లు: దేవేందర్ రెడ్డి

హైదరాబాద్: బియ్యం సేకరణపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలోని రెండు వేల రైస్‌మిల్లుల ఓనర్లు ఆందోళనలో ఉన్నారని దక్షిణాది రాష్ట్రాల రైస్ మిల్లర్ల సంఘం నేత తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేవలం 600 రైస్ మిల్లులు మాత్రమే నడుస్తున్నాయన్నారు. యాసంగిలో పండిన పంటను " రా" రైస్ చేయాలంటే 30 శాతం నూకలు అవుతాయన్నారు. పారా బాయిల్డ్ రైస్‌కి బదులు రా రైస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే కేంద్రం నుంచి నూకల బియ్యం కొంటమని హామీ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది యాసంగి ధాన్యం ఇంకా మిల్లర్ల దగ్గరే మూలుగుతుందన్నారు. కేంద్రం గతేడాది చెప్పినప్పుడు వరిలో ఇతర వంగడాలపై ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదన్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బియ్యం పండించాలని చెప్పడంలో రాష్ట్రం విఫలమైందన్నారు. 




Updated Date - 2021-11-24T21:32:46+05:30 IST