ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వరి విత్తనాలను అమ్మకూడదు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-20T11:18:02+05:30 IST

నియంత్రిత వ్యవసాయ విధానం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వరకు వరి విత్తనాల ను అమ్మకూడదని కలెక్టర్‌ ముషారఫ్‌

ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వరి విత్తనాలను అమ్మకూడదు : కలెక్టర్‌

నిర్మల్‌, మే 19(ఆంధ్రజ్యోతి): నియంత్రిత వ్యవసాయ విధానం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వరకు వరి విత్తనాల ను అమ్మకూడదని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ విత్తన డీలర్ల ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, విత్తనడీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలు ఉత్పాదకత పెరగడం వల్ల ప్రభు త్వం నియంత్రిత పంటల విధానం అమలు చేయనుందని, భూమి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల వారిగా పంట లక్ష్యాలు  నిర్దేశించిందన్నారు.


ప్రభుత్వ సూచనల మేరకు వరి సన్న, సాధార ణరకం పండించే భూములను, రైతులను గుర్తించి విత్తనాలను పం పిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు రె ండు, మూడు రోజుల్లో వస్తాయని, అప్పటివరకు వరి విత్తనాలను డీలర్లు పంపిణీ చేయవద్దని ఆదేశించారు. మొక్కజొన్న సాగు చేసిన వారికి రైతుబంధు వర్తించదని, కనీస మద్దతుధర ప్రభుత్వం చెల్లించదని  తెలిపారు.


ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులు పత్తి పంట రెడ్‌గ్రామ్‌ సాగు చేసుకోవాలన్నారు. మొక్కజొన్న విత్తనాలు అమ్మకూడదని డీలర్లకు సర్కూలర్‌ జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, సహాయ సంచాలకుడు కోటేశ్వర్‌రావు, మహమ్మద్‌ఇబ్రహీం హనీఫ్‌, వినయ్‌ బాబు, వ్యవసాయ అధికారులు, విత్తనాల డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-20T11:18:02+05:30 IST