గిరిశిఖర గ్రామాల్లో రైస్‌ స్టాక్‌ పాయింట్లు

ABN , First Publish Date - 2021-04-21T05:20:33+05:30 IST

సాలూరు మండలంలో గిరిశిఖర గ్రామాల గిరిజనులకు బియ్యం అందించడానికి రైస్‌స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్టు సాలూరు తహసీల్దార్‌ శ్రీనివాసరావు, సీఎస్‌డీటీ చంద్రశేఖర్‌ మంగళవారం చెప్పా రు.

గిరిశిఖర గ్రామాల్లో రైస్‌ స్టాక్‌ పాయింట్లు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 20: సాలూరు మండలంలో గిరిశిఖర గ్రామాల గిరిజనులకు బియ్యం అందించడానికి రైస్‌స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్టు సాలూరు తహసీల్దార్‌ శ్రీనివాసరావు, సీఎస్‌డీటీ చంద్రశేఖర్‌ మంగళవారం చెప్పా రు. గిరిశిఖర గిరిజనుల చెంతకు బియ్యం అందించడానికి ఐటీడీఏ పీవో కూర్మనా థ్‌ ఆదేశాల మేరకు ఈ స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. కొదమ పంచా యతీలో ఉన్న సిరివర, పొయిమాల, డోయివర, సారపాడు, గుంజారి, చింతామల, బందపాయి, లొద్ద, కొదమ, పెద్దచోర, చోర, ఎం.చింతలవలస, మాసిక చింతలవ లస, అడ్డుగు, కొడంగివలసమోనంగి గిరిశిఖర గిరిజనులకు బియ్యం చెంతనే అందించనున్నామని తెలిపారు. వీరి కోసం సిరివర, సారపాడు, చింతామల, కొదమ, నందల్లో రైస్‌ స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయిభ ద్ర వారికి అదే గ్రామంలో, కరడవలస, కరడకొత్తవలస వారికి రొడ్డవలసలో, కొఠియా గ్రూపు గ్రామాల ప్రజలకు నేరేళ్లవలస,ఽ దూళిభద్రలో స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులతో సీఎస్‌డీటీ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సమావేశాలను నిర్వహించామని తెలిపారు.  

Updated Date - 2021-04-21T05:20:33+05:30 IST