ఘనంగా బొక్కలగుట్ట బోనాల జాతర

ABN , First Publish Date - 2021-08-02T03:44:29+05:30 IST

బొక్కల గుట్ట బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఆషాఢమాసం చివరి వారంలో బోనాల జాతర నిర్వహిస్తారు. శివసత్తుల పూనకాలు, పోత రాజుల నృత్యాలతో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించి, మొక్కులు తీర్చు కున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వర కు భక్తుల రద్దీ కొనసాగింది.

ఘనంగా బొక్కలగుట్ట బోనాల జాతర
బోనాలతో వస్తున్న భక్తులు

 మందమర్రి, ఆగస్టు 1: బొక్కల గుట్ట బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట  సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఆషాఢమాసం చివరి వారంలో బోనాల జాతర నిర్వహిస్తారు. శివసత్తుల పూనకాలు, పోత రాజుల నృత్యాలతో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలను సమర్పించి, మొక్కులు  తీర్చు కున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వర కు భక్తుల రద్దీ కొనసాగింది. ఆదివారం సెలవు కావడం తో భక్తులు భారీగా తరలివచ్చారు. అవాంఛనీయ సంఘ టనలు జరుగకుండా సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. స్వచ్ఛంద సంస్థలు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు ఏర్పాట్లు చేశారు.  మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, జడ్‌పీటీసీ రవి, బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్‌, పాల రాజు తదితరులు ఉన్నారు.

వైభవంగా పోచమ్మ బోనాలు

మంచిర్యాల కలెక్టరేట్‌: పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెక్కల విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి హమాలి వాడ కట్ట పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరే గింపు నిర్వహిం చారు. ప్రజలు ఆరోగ్యంగా  ఉం డాలని వేడుకు న్నట్టు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన, కార్యద ర్శులు ప్రకాష్‌, బుజ్జన్న, వీరమల్లు, పూర్ణ చందర్‌, రమేష్‌, శ్రీధర్‌, రాజీరు, మురళి  పాల్గొన్నారు.

బైరవునికి భక్తుల పూజలు 

కోటపల్లి: పారుపెల్లిలో ఆదివారం బైరవస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆషాఢమాసం అష్టమి తిథి ఆదివారం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. పారుపెల్లితో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, చెన్నూరుకు చెందిన మార్వాడీలు హాజరై మంగళహారతులు, అభిషే కాలు, అర్చనలు నిర్వహించడంతో ఈ ప్రాంతంలో   సందడి నెలకొంది. 

 

Updated Date - 2021-08-02T03:44:29+05:30 IST