ఘనంగా మకర సంక్రాంతి

ABN , First Publish Date - 2022-01-17T05:03:40+05:30 IST

మూడ్రోజుల సంక్రాంతి సంబు రాలు ముగిసింది..

ఘనంగా మకర సంక్రాంతి
భీంనగర్‌లో ముగ్గులు వేస్తున్న బాలికలు

- ఊరూవాడా కుటుంబసమేతంగా

     పండుగ సంబురాలు

- అలరించిన రంగవల్లులు

గద్వాల/గద్వాలటౌన్‌/వడ్డేపల్లి/రాజోలి/ఇటిక్యాల /అయిజ, జనవరి 16: మూడ్రోజుల సంక్రాంతి సంబు రాలు  ముగిసింది..భోగితో ప్రారంభమైన పండగ, మ కర సంక్రాంతిరోజైన శనివారం కుటుంబసభ్యులంతా కలిసి గొప్పగా వేడుకలు జరుపుకోగా, ఆదివారం  కను మను ముగించారు...అతిపెద్ద పండగ అయిన సంక్రాం తిని సొంతూళ్లలో సంప్రదాయ పద్ధతిలో  జరుపుకు నేందుకు జనం పల్లెబాట పట్టడంతో పల్లెలు పులకిం చి పోయాయి. జనంతో గ్రామాలన్నీ సందడిగా మారా యి. ఇంటిల్లిపాది పిండివంటలతో పాటు పశువుల పా కలను శుభ్రం చేసుకొని, పశువులను కడిగి కొత్త బియ్యంతో తయారు చేసిన పొంగళిని తిపించారు.   ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలపగా, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలికి ఆ పార్టీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలి పారు. పండుగ అందిరికి సంతోషాని ఇవ్వడంతో పాటు సకల సౌభ్యాగ్యాలు కలగాలని వారు ఆకాంక్షించారు.   జిల్లా కేంద్రంలో మకర సంక్రాం తి పండుగ ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముందు ముత్యాల ముగ్గులు కళకళలాడగా, పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. పండుగ శనివారం కావడంతో పాటు, 108ఏళ్ల అనంతరం పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చిన శనిత్రయోదని కావడంతో హనుమాన్‌ ఆలయాల్లో భ క్తుల రద్దీ పెరిగింది. ఈ శనిత్రయోదశి నాడు నవగ్రహా ల్లో ముఖ్యంగా శనిగ్రహానికి తైలాభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయంటూ విస్తృత ప్రచారం జ రిగిన నేపథ్యంలో నవగ్రహాలు కొలవైవున్న ఆలయాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. కాగా, ప్రతి ఏటా పండుగ నాడు ఎక్కువ వచ్చే గంగి రెద్దుల వారు సంఖ్య ఏడాది అంతగా కనిపించలేదు.  అయిజ, వడ్డేప ల్లి మునిసిపాలిటీ, ఇటిక్యాల మండల పరిధిలోని గ్రా మాల్లో సంక్రాంతి ఘనంగా నిర్వహించారు. యువతకు వివిధ  రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు గ్రామంలో గ్రామస్థులు డప్పులు, డోల్లు వాయిస్తూ, పూర్ణ కుంభాలను ఊరేగింపుగా సింగమవ్వ గుడికి తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి, మొక్కలు తీర్చుకున్నారు.  మాన్‌దొడ్డి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు, చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను గ్రామ సర్పంచు సవారి అందించారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ మన్సూర్‌, నిర్వాహకులు విజయరాముడు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:03:40+05:30 IST