ఘనంగా దసరా సంబురాలు

ABN , First Publish Date - 2021-10-17T06:33:09+05:30 IST

జిల్లాలో శుక్రవారం విజయదశమి వే డుకలను ప్రజలు ఘనంగా నిర్వహించకున్నారు. పట్టణంలోని కన్యక పర మేశ్వరి ఆలయం నుంచి దస్నాపూర్‌లోని దసరా మైదానం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం మైదానంలో శమి పూజ చేశారు. ఎ మ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్రతో కలిసి వేడుకలను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెడుపై మంచి విజ యం సాధించినందుకే విజయదశమి జరుపుకోవడం జరుగుతుందన్నారు.

ఘనంగా దసరా సంబురాలు
జిల్లాకేంద్రంలో దహనమవుతున్న రావణ బొమ్మ

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు16 : జిల్లాలో శుక్రవారం విజయదశమి వే డుకలను ప్రజలు ఘనంగా నిర్వహించకున్నారు. పట్టణంలోని కన్యక పర మేశ్వరి ఆలయం నుంచి దస్నాపూర్‌లోని దసరా మైదానం వరకు శోభా యాత్ర నిర్వహించారు. అనంతరం మైదానంలో శమి పూజ చేశారు. ఎ మ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్రతో కలిసి వేడుకలను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చెడుపై మంచి విజ యం సాధించినందుకే విజయదశమి జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఎస్పీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి గొప్పదని, ఇతర దేశాలు మన సంస్కృతిని అనుసరించడం గర్వకారణమ ని పేర్కొన్నారు. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ సమాజంలో చెడు పై మంచి ఎప్పటికీ విజయం సాధిస్తుందని, ఆ విజయకాంక్షతో ప్రజలు ముందుకు వెళ్లాలని కోరారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, హిం దూ సమాజ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు జంగిలి ఆశన్న, బీజేపీ జిల్లా అధ్య క్షుడు పాయల శంకర్‌ పాల్గొన్నారు.
రావణ దహనంలో అపశ్రుతి..
దస్నాపూర్‌లోని దసరా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఒక్కసారిగా రావణ దహనం కో సం ఏర్పాటు చేసిన బొమ్మలో టపాసులు పేలి జనాల మీద పడ్డాయి. దీంతో జనం ఒక్కసారిగా కేకలు వేస్తూ భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. కొంతమందిపై నిప్పురవ్వలు పడగా స్వల్ప గాయాలతో బయ ట పడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉట్నూర్‌లో..
ఉట్నూర్‌: స్థానిక హన్మాన్‌ మందిరం నుంచి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రామ మందిరం వరకు శోభాయాత్ర నిర్వహించారు. జడ్పీ చై ర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు ఆధ్వర్యంలో శమివృక్షానికి పూజలు చేసి రావణ బొమ్మను దహనం చేశారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలను నిర్వ హించారు. జమ్మిచెట్టుకు పూజలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలి యజేసుకున్నారు.
ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు
ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగురామన్నను నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాలప్రజలు కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి రాంచంద్రారెడ్డిని తలమడుగు జడ్పీటీసీ గోకగణేష్‌రెడ్డి, ఎంపీపీ రాజేశ్వర్‌లు కలిసిన దసరా శుభాకాంక్షలు తెలిపారు.
బజార్‌హత్నూర్‌లో..
బజార్‌హత్నూర్‌: మండల ప్రజలు వేడుకలను ఘనంగా నిర్వహించా రు. జమ్మిచెట్టుకు పూజలు చేశారు. బంధువులకు, స్నేహితులకు బంగారా న్ని పంచి పెట్టి అలయ్‌బలయ్‌ చేసుకున్నారు.
నేరడిగొండ  పోలీసుస్టేషన్‌లో..
నేరడిగొండ: నేరడిగొండ పోలీసుస్టేషన్‌లో ఎస్సై భరత్‌సుమన్‌ ఆయుధ పూజ చేశారు. రాజురాలోని జగదాంబ ఆలయంలో లింబా మహరాజ్‌, జ డ్పీటీసీ జాదవ్‌ అనిల్‌ పూజలు చేశారు.
జైనథ్‌ మండలంలో..
జైనథ్‌: స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పల్లకిని ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. దీపాయిగూడలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న తల్లి జోగుఆశమ్మకు బంగారాన్ని అందించి ఆశీస్సులను పొందారు.
పాండుగూడలో..
సిరికొండ: మండలంలోని పాండుగూడలో ఆదివాసీలు గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. గ్రామపెద్దలు పాల్గొన్నారు.
పలు గ్రామాలలో..
బోథ్‌: మండలంలో పలు గ్రామాలలో దసరా వేడుకలు నిర్వహించారు. బోథ్‌, సోనాల, కన్గుట్ట, కౌఠ(బి)లో దుర్గాదేవిల నిమజ్జనాలు చేశారు. సో నాల రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోథ్‌లోని సీఐ కార్యాలయంలో ఆయుధ పూజను నిర్వహించారు.
తాంసిలో..
తాంసి : ఆయా గ్రామాలలో ప్రజలు శమి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం శమి ఆకులను గ్రామ దేవతలకు సమర్పించారు.
తలమడుగులో..
తలమడుగు: వేంకటేశ్వర ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించా రు. బస్టాండ్‌ సమీపంలో జమ్మి చెట్టుకు పూజా కార్యక్రమాలను నిర్వహించి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.

Updated Date - 2021-10-17T06:33:09+05:30 IST