ఘనంగా గంగనీళ్ల జాతర

ABN , First Publish Date - 2021-10-11T06:05:46+05:30 IST

మహా అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సంగెం గో దావరి నదితీరం కిక్కిరిసింది. సంగెం గంగపోచమ్మ చెంత నిద్దరోయిన అ డెల్లి పోచమ్మ ఆదివారం తెల్లవారు జామున గోదావరి వద్దకు చేరింది. పవి త్ర గోదావరిలో జలకాలిడిన అడెల్లి పోచమ్మ తల్లి భక్తుల పూజలందుకుం ది. అనంతరం సంగెం నుంచి బయలుదేరి మల్లాపూర్‌, కంజర్‌, బన్సపల్లి గ్రామాల మీదుగా దిలావర్‌పూర్‌ చేరుకున్న అడెల్లి పోచమ్మ తల్లికి వీడీసీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దిలావర్‌పూర్‌లో వీధులన్నీ భక్తులతో నిండి పోయాయి.

ఘనంగా గంగనీళ్ల జాతర
భక్తులతో కిక్కిరిసిన దిలావర్‌పూర్‌ వీధులు

దిలావర్‌పూర్‌, అక్టోబరు 10 : మహా అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులతో సంగెం గో దావరి నదితీరం కిక్కిరిసింది. సంగెం గంగపోచమ్మ చెంత నిద్దరోయిన అ డెల్లి పోచమ్మ ఆదివారం తెల్లవారు జామున గోదావరి వద్దకు చేరింది. పవి త్ర గోదావరిలో జలకాలిడిన అడెల్లి పోచమ్మ తల్లి భక్తుల పూజలందుకుం ది. అనంతరం సంగెం నుంచి బయలుదేరి మల్లాపూర్‌, కంజర్‌, బన్సపల్లి గ్రామాల మీదుగా దిలావర్‌పూర్‌ చేరుకున్న అడెల్లి పోచమ్మ తల్లికి వీడీసీ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. దిలావర్‌పూర్‌లో వీధులన్నీ భక్తులతో నిండి పోయాయి. అమ్మవారి ఆభరణాల మూటను తాకేందుకు భక్తులు పోటి పడ్డారు. నిర్మల్‌ రూరల్‌ సీఐ వెంకటేష్‌, సోన్‌ సీఐ రామ్‌ నర్సింహ రెడ్డి ఆఽ ద్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అమ్మవారికి ఆభరణాల మూట దిలావర్‌పూర్‌ శివారు గ్రామం మాడేగాం వరకు సాగనంపి అమ్మ వారి సన్నిధి అడెల్లికి చేర్చారు.
కడ్తాల్‌లో..
సోన్‌: కడ్తాల్‌లో ఆదివారం గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా బజర్‌హత్నూర్‌ మండలం దేగాం గ్రామానికి చెందిన పోచమ్మ తల్లి ఆభరణాలకు శనివారం సాయంత్రం గ్రామస్థులు స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారు జామున సోన్‌ గోదావరి నదిలో పుణ్య స్నా నాలు ఆచరించి ఆభరణాలను శుద్ధి చేశారు. అనంతరం పాదయాత్రగా గ్రా మానికి చేరుకున్నారు. గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించా రు. వీడీసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అడెల్లి పోచమ్మ.. చల్లంగా చూడమ్మ
సారంగాపూర్‌: అడెల్లి పోచమ్మ తల్లి... చల్లంగా చూడమ్మ అంటూ భ క్తులు అమ్మవారికి నీరాజనం పలికారు. అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. రెండురోజుల పాటు సాగిన జా తరకు భక్తులు వచ్చారు. శనివారం మధ్యాహ్నం పోచమ్మ నగలను అడెల్లి దేవాలయం నుంచి వేలాది మంది భక్తులు కాలినడకతో 30 కిలోమీటర్ల పా టు గోదావరి నదికి తీసుకెళ్లారు. తిరిగి నగలను దేవాలయానికి తెచ్చి అలం కరించడంతో జాతర ముగిసింది. అమ్మవారికి పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. అడెల్లి పోచమ్మ ఆలయంలో అ ల్లోల సోదరుడు మురళీధర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2021-10-11T06:05:46+05:30 IST