ఘనంగా రంజాన్‌ వేడుకలు

ABN , First Publish Date - 2022-05-04T05:37:24+05:30 IST

రంజాన్‌ పండగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు.

ఘనంగా రంజాన్‌ వేడుకలు
జగిత్యాలలో ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలు

- ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు  

జగిత్యాల టౌన్‌, మే 3: రంజాన్‌ పండగను ముస్లింలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. నూతన దుస్తులు ధరించి చిన్నా పెద్దా తేడా లేకుండా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గతించిన తమ కుటుంబస భ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా కేం ద్రంలోని మంచినీళ్ల బావి సమీపంలో ఉన్న ఈద్గా వద్ద మౌలానా ముస్తా క్‌ అహ్మద్‌ ప్రార్థనలు చేయించి రంజాన్‌ ప్రాముఖ్యత గురించి వివరించారు. రంజాన్‌పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జగిత్యాల చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి శుభాకాంక్షలు తెలిపారు. 


Read more