Abn logo
Jan 27 2021 @ 00:11AM

జిల్లాలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వాడవాడలా రెపరెపలాడిన జాతీయ జెండా 

జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు 

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 26: జిల్లాలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా రాజకీయ పార్టీల నాయకులు వారి కార్యాలయాల్లో జాతీయ పతాకా న్ని ఎగుర వేశారు. అలాగే పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగన్మోహన్‌రావ్‌, జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌జనార్దన్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన అధికారు లు, ఉద్యోగులు, సిబ్బందికి కలెక్టర్‌, జడ్జి, ఎస్పీ ఉత్తమ సేవా పథకాలను అందజేశారు.

ఆదిలాబాద్‌రూరల్‌: యాపల్‌గూడలోని తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో కమాండెంట్‌ వేణుగోపాల్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ సేవాలక్ష్మి, వైస్‌ ఎంపీపీ గండ్రత్‌ రమేష్‌ జెండా ఎగుర వేయగా, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ మోహన్‌సింగ్‌,  రూరల్‌ పోలీసు  స్టేషన్‌ లో సీఐ పురుషోత్తంచారి, ఎస్సై హరిబాబు, మండలంలోని చాందా, యాపల్‌గూడ, పొచ్చెర, అంకోలి, రామాయి తదితర గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు, కార్యదర్శులు జెండాలను ఎగుర వేశారు.

మావల: మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వనాజరెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో బండి అరుణ, పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్సై రమేష్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సుజాత, ఎంపీవో లక్ష్మణ్‌, ఆర్‌ఐ హన్మంత్‌రావ్‌, సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

బేల: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ బడాల రాంరెడ్డి, ఇందిరాచౌక్‌లో మాజీ జడ్పీటీసీ రాందాస్‌నాక్లె, జెండాను ఎగుర వేశారు. సామూ హిక జెండాను శంకర్‌ మనుస్మరే, పోలీసు స్టేషన్‌లో ఏఎస్సై సిరాజ్‌ఖాన్‌, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌, ఎంఈవో కార్యాలయంలో  కోళ నర్సింహులు, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వనతి గంభీర్‌ ఠాక్రె జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భగత్‌రవీందర్‌, ఎంపీటీసీ పాల్గొన్నారు.

జైనథ్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో వి.గజానన్‌రావ్‌, సీఐ కార్యాలయంలో సీఐ కె.మల్లేష్‌,  పోలీసు స్టేషన్‌లో ఎస్సై సాయిరెడ్డి వెంకన్న, జైనథ్‌ జీపీ కార్యాలయంలో సర్పంచ్‌ డి.దేవన్న, ఎస్సీ వసతి గృహంలో వార్డెన్‌ నారాయణ, సహకార సంఘం సీఈవో గంగన్న, చైర్మన్‌ బీజీఆర్‌, విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ శంకర్‌లు జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 

నార్నూర్‌: నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జాకీర్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రమేష్‌, మండల విద్యాభివృద్ధి కార్యాలయంలో ఎంఈవో ఆశన్న, పీఎసీఎస్‌ కార్యాలయంలో సీఈవో హన్మంత్‌రావు, ఏకలవ్య కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలాజీ కాంబ్లే, పోలీసు స్టేషన్‌లో ఎస్సై విజయ్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. 

ఇంద్రవెల్లి: మండలంలోని గ్రామాల్లో ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీతో పాటు అంబేద్కర్‌ విగ్రహం వద్ద సర్పంచ్‌ కోరెం గాంధారి సుకంట్‌రావు, గ్రంధాలయంలో ఎంపీపీ పోటే శోభాబాయి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పుష్పల, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, పోలీసు స్టేషన్‌లో ఎస్సై నాగనాథ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, మార్కెట్‌ యార్డు కార్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాథోడ్‌ మోహన్‌నాయక్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్‌ డోంగ్రే మారుతి, ఐకేపీ కార్యాలయంలో ఏపీవో రాథోడ్‌ రామారావు, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఏఈ చంద్రశేఖర్‌, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

బోథ్‌: మండలంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోథ్‌ మున్సిఫ్‌ కోర్టులో మెజిస్ర్టేట్‌ జెండాను ఎగుర వేయగా, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శివరాజ్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాఽధ, గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, రేంజి కార్యాల యంలో ఎఫ్‌ఆర్‌వో సత్యనారాయణ, ఆసుపత్రిలో డాక్టర్‌ రవీంద్రప్రసాద్‌ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

నేరడిగొండ: మండలంలో గణతంత్ర దినోత్సవాన్ని పుర స్కరించుకుని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యుటీ తహసీల్దార్‌ సమీర్‌ఖాన్‌, ఎంఈవో కార్యాలయంలో భూమారెడ్డి, ఎస్సై భరత్‌సుమన్‌, వ్యవసా యాధికారి భాస్కర్‌, వైద్యాధికారి ఆనంద్‌కుమార్‌, పశు వెద్యాధికారి సుశిల్‌కుమార్‌, ఏపీఎం సుదర్శన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సాబ్లే కిషోర్‌సింగ్‌, జూనియర్‌ కళాశాలలో జాదవ్‌ బలిరాం జెండాను ఎగురవేశారు.  

తలమడుగు: మండలంలో గణతంత్ర దినోత్సవ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామ పంచా యతీల్లో సర్పంచ్‌లు,  సెక్రటరీలు జెండాను ఎగుర వేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపీడీవో రమాకాంత్‌, మండల పశువైద్యాధికారి దూద్‌రాం రాథోడ్‌, వ్యవసాయాధికారి మహేందర్‌, ఎస్సై దివ్యభారతి, సహకార సంఘం చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సీఈవో మోతే శ్రీనివాస్‌, సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, హెచ్‌ఎం శ్యాముల్‌ జెండాను ఎగుర వేశారు.  

ఇచ్చోడ: మండల కేంద్రంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సునీత జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అతికొద్దీన్‌, పోలీసుస్టేషన్‌లో ఎస్సై సూర్య ప్రకాష్‌, మండల అభివృద్ధి కార్యాలయంలో రాంప్రసాద్‌ జెండాను ఎగురవేశారు.

ఇచ్చోడరూరల్‌: మండలంలోని బోరిగామ, కోకస్‌ మన్నూర్‌, ముక్ర, తలమద్రి, నర్సాపూర్‌, సిరిసెల్మ, గుండాల తదితర గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పాఠశాలలో జాతీయ జెండాను ఎగుర వేశారు. కరోనా వల్ల గ్రామాల్లో విద్యార్థుల, ఊరేగింపులు, పాఠశాలలో ఆటల పోటీలు లేక సాదాసీదాగా వేడుకలను జరుపుకున్నారు.

బజార్‌హత్నూర్‌: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పద్మావతి డిగ్రీ కళాశాలలో, పోలీసు స్టేషన్‌లో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

గుడిహత్నూర్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీ ల్దార్‌ పవన్‌చంద్ర, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో సునీత, పోలీసు స్టేషన్‌లో ఎస్సై రోహిణి, పశు వైద్యశాలలో రాథోడ్‌ జీవన్‌, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం భగవండ్లు, గుడిహత్నూర్‌ గ్రామ పంచాయతీ కార్యాల యంలో సర్పంచ్‌ జాదవ్‌ సునీత ఎండాను ఎగుర వేశారు. 

బీంపూర్‌: మండలంలోని పోలీసు స్టేషన్‌లో ఎస్సై ఎండీ ఆరీఫ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా.విజయ సారథి జాతీయ జెండా ఎగుర వేశారు. అనంతరం మండల పరిషత్‌లో ఎంపీడీవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఆఫీస్‌లో తహసీల్దార్‌ సోములు జెండా ఎగుర వేశారు. టీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ మేకల నాగయ్య, బీజేపీ  మండల అధ్యక్షుడు జాజ్జిరి రాకేష్‌, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మడావి లింబాజి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తాంసి: గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ స్వప్న, వీడీసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, డా.శ్రీకాంత్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో సంధ్యారాణి, మండల పరిషత్‌ కార్యాల యంలో ఎంపీడీవో భూమయ్య, సహకార సొసైటీ ఆవరణలో సీఈవో కేశవ్‌లతో పాటు ఆయా సంఘాలు, పార్టీ కార్యాలయాల వద్ద మూడు రం గుల జెండాలను ఎ గుర వేశారు. 

సిరికొండ: మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావ్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో సర్పరాజ్‌ నవాజ్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్సై కృష్ణ కుమార్‌, పంచాయతీ కార్యాలయంలో ఓరుగంటి నర్మదతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు రఘురాం, అనిల్‌కుమార్‌, జయశ్రీ లచ్చు, గంగాధర్‌, నర్మదా భగవంత్‌రావ్‌, లక్ష్మిదినేష్‌, లచ్చిరామ్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గిరిజన ప్రాంతాలకు సముచిత స్థానం 

ఉట్నూర్‌: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్‌ అవార్డులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సముచిత స్థానం లభించడం హర్షనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా అన్నారు. మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడారు. 1981లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఎదుట, 2008లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఎదుట గోండుల గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించిన జైనూర్‌ మండలం మార్లవాయికి చెందిన కనక రాజుకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న లక్ష ఉద్యోగాల ఖాళీల భర్తీలలో ఉమ్మడి జిల్లాలోని గిరిజన నిరుద్యోగులకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలను ఇస్తామన్నారు. తోటి గిరిజనుడు మారుతి ఢిల్లీలో జరిగిన పరేడ్‌కు హాజరయ్యారని ఈ సందర్భంగా తెలిపారు. 

Advertisement
Advertisement