జాతీయ జండాను ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి కల్చరల్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జి ల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారా యణ జాతీయ జండాను ఆవిష్కరించగా జిల్లాలోని అధికారులు, కార్యాల య సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎగు రవేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్‌నాయక్, వైస్‌చైర్మన్ సురేందర్, జడ్పీటీసీ రామ్మూర్తి, మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ మమతారెడ్డి జండాను ఆవిష్కరించగా, కమిషనర్ తిరుపతి, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జండాను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎగురవేశారు. మున్సిప ల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వైస్ చైర్మన్ నజ్మీన్ సుల్తానా, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు సరేష్, రవి, రమేష్, జావిద్, వంశీ, అన్వేష్ పాల్గొన్నారు. మనసు సేవ సంస్థ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు జాతీయ పతాకా న్ని ఆవిష్కరించా రు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పాల్గొని జాతీయ జండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రం గ్రంథాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్పర్సన్ మమతరెడ్డి, కమి షనర్ తిరుపతి పాల్గొన్నారు.