ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-01-16T05:14:18+05:30 IST

జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెల్లో, పట్టణాల్లో గం గిరెద్దులు, హరిదాసుల విన్యాసాలు ఆహ్లాదపరిచాయి.

ఘనంగా సంక్రాంతి వేడుకలు
జగిత్యాలలో ముగ్గు వేస్తున్న చైర్‌ పర్సన్‌

జగిత్యాల టౌన్‌, జనవరి 15: జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెల్లో, పట్టణాల్లో గం గిరెద్దులు, హరిదాసుల విన్యాసాలు ఆహ్లాదపరిచాయి. శుక్రవారం కనుమ పండుగ ఉత్సవాలను కూడా చేసుకుని మహిళలు అందరు ఆయు రారోగ్యాలతో ఉండాలంటూ పూజలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళలు ఉదయం నుంచే తమ ముంగిళ్ల వద్ద ముగ్గులతో సందడి చేశారు.  

ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కనుమ పండుగ రోజున మహాలక్ష్మి పూజలు, నోములు జరిపి పసు పు, కుంకుమలు పరస్పరం స్వీకరించారు. స్థానిక లక్ష్మీ నరసింహ కాలనీలో శ్రీ రా మాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా ని లిచిన ఎనగందుల తేజశ్రీ (ప్రథమ), బోగ నవ్య (ద్వితీయ), గడమల్ల రష్మిత (తృ తీయ) లకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరు రాజేష్‌కుమార్‌ చేతుల మీదుగా బహమతులు అందించారు.  

రాయికల్‌ : రాయికల్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజ లు గురువారం మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉ దయం నుంచి మహిళలు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఇళ్ల ముంగిట కల్లాపి చల్లి ముగ్గులు వేసుకున్నారు. పట్టణంలోని పోచమ్మవాడ గోసంగి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పో టీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతుల ప్రదానం చేశారు. కౌన్సిలర్లు తురగ శ్రీధర్‌ రెడ్డి, మహేందర్‌, ఏఎంసీ డైరెక్టర్‌ స్వామి, సంఘం అధ్యక్షుడు రాజేష్‌, సలహాదారు మల్యాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కోరుట్ల : పట్టణంలో సంక్రాంతి వేడుకలను గురు, శుక్రవారం మహిళలు ఘ నంగా నిర్వహించారు. కనుము, సంకాంత్రి వేడుకలను నిర్వహించారు. మహిళలు నోములు నోచుకొని వాహినాలను ఇచ్చిపుచ్చకున్నారు. ఎమ్మెలే సతీమణి సరోజ కనుము పండుగ సందర్బంగా పట్టణంలోని పలువుకి ఇండ్లలో జరిగిని నోముల ఉత్సవాలలో పాల్గొని వాహినాలను స్వీకరించారు.  

Updated Date - 2021-01-16T05:14:18+05:30 IST